What is Cloud Burst? | What is KCR’s ‘Cloud Burst’ Story ?
గోదావరి వరదలతో భారీ నష్టం వాటిల్లిన తరుణంలో.. తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది.
క్లౌడ్ బరస్ట్ సాధ్యమేనా..? అసలు ఎలా జరుగుతుంది..? గతంలో ఎవరైనా చేశారా..? విదేశీ కుట్రకు అవకాశం ఉందా..? ఈ ప్రశ్నలు ఇప్పుడు అందరికీ ఆసక్తి కలిగిస్తున్నాయి.
తెలంగాణ సీఎం చేసిన వ్యాఖ్యల తర్వాత క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటనే చర్చ మొదలైంది..? క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి..? అసలు తెలంగాణలో సంభవించింది క్లౌడ్ బరస్టేనా కాదా..? అనే విషయం తెలుసుకోవడానికి జనం ఇంట్రెస్ట్‌గా ఉన్నారు.
క్లౌడ్ బరస్ట్’పై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుండపోత వర్షంపై ఏవో కొన్ని కుట్రలు ఉన్నట్లు చెబుతున్నారని.. ఇవి ఎంతవరకు నిజం అనేది ఇంకా తెలియదన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా భద్రాచలం వెళ్లిన ఆయన.. అక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విదేశీయులు కావాలనే మన దేశంలో అక్కడక్కడా ‘క్లౌడ్ బరస్ట్’ చేస్తున్నట్లు తెలుస్తోందని వ్యాఖ్యానించారు. గతంలో జమ్మూకశ్మీర్‌లోని లేహ్, లద్దాఖ్.. ఆ తర్వాత ఉత్తరాఖండ్‌లో ఇలా చేశారన్నారు. ఇటీవల గోదావరి పరీవాహక ప్రాంతంపై అలా చేస్తున్నట్లు ఓ సమాచారం వచ్చిందని చెప్పారు. ఏదేమైనా ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
క్లౌడ్ బరస్డ్ ..ఈ పదం ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. గత వారంలో అమరనాథ్ లో ఆకస్మికంగా వరదలు వచ్చాయి. ఎవరూ ఊహించని విధంగా కొండ కోనల నుంచి ఒక్కసారిగా వరద పోటెత్తింది. వరదలకు అమరనాథ్ యాత్రికులు కకావికలం అయ్యారు. ఆకస్మిక వరదల్లో 16 మంది యాత్రికులు గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. క్లౌడ్ బరస్ట్ వల్లే వరదలు వచ్చాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గతంలో లడాఖ్ లోని లేహ్ ప్రాంతంలోనూ ఆకస్మిక వరదలు వచ్చాయి. అప్పుడు కూడా క్లౌడ్ బరస్ట్ జరిగిందనే వార్తలు వచ్చాయి. 2013లో ఉత్తరాఖండ్ లోనూ ఇలానే ఆకస్మిక వరదలు వచ్చాయి. గోదావరి వరదలపై స్పందించిన కేసీఆర్.. గోదావరిపై క్లౌడ్ బరస్ట్ కుట్ర జరిగిందనే అనుమానం వ్యక్తం చేశారు. క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్దతి ద్వారా దేశంలో ఆకస్మిక వరదలు స్పష్టిస్తున్నారని చెప్పారు. విదేశీ శక్తులు కుట్రలు చేస్తున్నాయన్న కేసీఆర్.. గతంలో లడ్ఖాలోని లేహా లో ఇలాంటే వరదలే వచ్చాయన్నారు. ఉత్తరాఖండ్ లో అలాగే చేశారన్నారు.
సీఎం కేసీఆర్ కామెంట్లతో క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి? ఆకస్మిక వరదలు స్పష్టించవచ్చా? ఒక ప్రాంతాన్ని టార్గెట్ చేసి కుండపోతగా వర్షాలు కురిపించవచ్చా? అన్న చర్చలు సాగుతున్నాయి. క్లౌడ్ బరస్ట్ అంటే తెలుగులో మేఘాల విస్ఫోటనం. వాతావరణ శాఖ వివరాల ప్రకారం ఒక చిన్న ప్రదేశంలో ఒక గంటలో 10 సెంటిమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వర్షం కురిస్తే దాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు. ఒక్కోసారి ఒకే ప్రాంతంలో ఒకటి కన్నా ఎక్కువసార్లు మేఘాల విస్ఫోటనం సంభవించే అవకాశం ఉంటుంది.2013లో ఉత్తరాఖండ్‌లో అలానే జరిగింది. అపార ఆస్తినష్టం.. భారీగా ప్రాణానష్టం జరిగింది. అయితే కుంభవృష్టిగా గంటలో 10 సెంటిమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసిన ప్రతిసారీ దాని క్లౌడ్ బరస్ట్ అయి ఉండదని అధికారులు చెబుతున్నారు. అది అక్కడి భౌగోళిక, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
సాధారణంగా రుతుపవనాలు దక్షిణ ప్రాంతంలోని అరేబియా సముద్రం నుంచి కొంత తేమను తీసుకువస్తాయి. అటు పశ్చిమ మధ్యధరా తీరం నుంచి వీచే గాలులు ఇరాన్, పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్ నుంచి తేమను తీసుకుని వస్తాయి. ఈ రెండూ ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు ఏర్పడిన మేఘాలు ఎక్కువ సాంద్రతను కలిగి ఉంటాయి. ఇవే క్లౌడ్ బరస్ట్ కు కారణమవుతాయి. పర్వతాలపై ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కొండలపై ఏర్పడిన మేఘాలు అధిక తేమను కలిగి ఉండటం వలన కుంభవృష్టి కురిపిస్తాయి. అందుకో పర్వతాలపై మేఘాల విస్ఫోటనం ఘటనలు ఎక్కువగా నమోదవుతుంటాయి. మన దేశంలోని ఉత్తర ప్రాంతాల్లో మే నుంచి జూలై ఆగస్ట్ వరకు క్లౌడ్ బరస్ట్ వాతావరణ పరిస్థితులు కనిపిస్తాయి. నదులు, సరస్సులు ఉన్న ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ జరిగితే అపార నష్టం జరగనుంది. మన దేశంలో కొండ ప్రాంతాలు ఎక్కువన్న ఉత్తరాఖండ్, జమ్మూూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లోనే ఇలాంటి ఘటనలుు ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రాణ, ఆస్తినష్టం భారీగా జరుగుతూ ఉంటుంది,
మన దేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే చిరపుంజి లాంటి ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ ఎక్కువగా సంభవిస్తుంటాయి. బెంగాల్ తీరం నుంచి వీచే అధిక తేమతో కూడిన గాలులతో ఆ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ సంభవిస్తుంటుంది. అయితే అక్కడి ప్రజలు ఈ పరిస్థితులకు అలవాటుపడిపోవడం వలన నష్టం ఎక్కువగా జరగదు. చిరపుంజిలో వరద నీరు ఒకే దగ్గర ఉండదు, లోతట్టు ప్రాంతానికి ప్రవహిస్తూనే ఉంటుంది. వరద వచ్చే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో జనాలు ఉండరు. అందుకే అక్కడ క్లౌడ్ బరస్ట్ అయినా ప్రాణ, ఆస్తి నష్టాలు జరగవు. ఒకటి నుంచి పది కిలోమీటర్ల లోపు ఉన్న ప్రాంతాల్లో తేమతో కూడిన భారీ మేఘాలు ఢీకొనడం వలన క్లౌడ్ బరస్ట్ జరుగుతుంది. అందుకే వీటిని అంచనా వేయడం చాలా కష్టం. రాడార్ సహాయంతో ఎక్కడెక్కక భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేయగలుగుతుంది. కానీ ఏ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ జరగవచ్చన్నది మాత్రం చెప్పలేకపోతుంది. దీన్ని అంచనా వేయడం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు.
అమర్‌నాథ్ ప్రాంతంలో జులై 8వ తేదీ సాయత్రం 4:30 నుంచి 6:30 గంటల మధ్య 31 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. కాబట్టి ఇది క్లౌడ్ బరస్ట్ నిర్వచనం పరిధిలోకి రాదు. అమర్‌నాథ్ యాత్రకు సమీపంలోని ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడం వల్ల ఒక్కసారిగా వరదలొచ్చాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ తెలిపారు. అంటే ఇవి ఫ్లాష్ ఫ్లడ్స్ మాత్రమే. క్లౌడ్ బరస్ట్ వల్ల తక్కువ సమయంలో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. కానీ అదే సమయంలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే.. కొద్దిసేపట్లోనే ఎక్కువ వర్షం పడిన ప్రతి సందర్భాన్ని క్లౌడ్ బరస్ట్ అని అనలేం.
మన దేశంలో ఇప్పటి వరకూ ఎన్నిసార్లు క్లౌడ్ బరస్ట్ సంభవించిందనే కచ్చితమైన సమాచారం లేదు. అంతే కాదు క్లౌడ్ బరస్ట్‌లను వెంటనే గుర్తించడం కష్టంతో కూడిన పని. కానీ పర్వత ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ ఎక్కువగా సంభవిస్తుంది. దీనికి అక్కడి ఎత్తైన ప్రదేశం, నేల వాలు లాంటి భౌగోళిక పరిస్థితులే కారణం.
పర్వత ప్రాంతాలు మిగతా ప్రాంతాల కంటే ఎత్తులో ఉంటాయి. ఇలాంటి ప్రదేశాలకు నీటిని మోసుకుపోయిన మేఘాలు.. సంతృప్త స్థాయికి చేరడం వల్ల వర్షించడానికి సిద్ధంగా ఉంటాయి. కానీ అక్కడి వేడి వాతావరణ పరిస్థితుల వల్ల వర్షించడం మేఘాలకు సాధ్యం కాదు. వర్షపు చినుకులు కిందకు పడే బదులు.. వేడి వాతావరణం వల్ల పైకి కదులుతాయి. దీంతో కొత్త వర్షపు బిందువులు ఏర్పడటంతోపాటు.. అప్పటికే ఉన్న వర్షపు చుక్కల పరిమాణం పెరుగుతుంది. కొంత సమయం తర్వాత వర్షపు బిందువులను మోయలేని స్థితికి మేఘాలు చేరుకుంటాయి. దీంతో ఒక్కసారిగా వర్షాన్ని కురిపిస్తాయి.
2013లో కేదార్‌నాథ్ ప్రాంతంలో వచ్చిన వరదలకు క్లౌడ్ బరస్ట్ కారణం. ఆ సమయంలో అక్కడ భారీ స్థాయిలో మేఘాలు ఏర్పడగా.. వాటి సాంద్రత కూడా అంతే వేగంగా పెరిగిపోయింది. దీని వల్లే క్లౌడ్ బరస్ట్ సంభవించి ఉంటుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. సాపేక్ష ఆర్ధ్రత, మేఘాలు అప్పటికే గరిష్ట స్థాయికి చేరడం, అత్యల్ప ఉష్ణోగ్రతలు, గాలులు మెల్లగా వీయడం లాంటి పరిస్థితులు క్లౌడ్ బరస్ట్‌కు దారి తీశాయి. గత ఏడాది దాదాపు ఇదే సమయంలో అమర్‌నాథ్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. లక్కీగా కరోనా కారణంగా అప్పుడు అమర్‌నాథ్ యాత్రను రద్దు చేయడంతో ప్రమాదం తప్పింది.
క్లౌడ్ బరెస్ట్ అనేది అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ వర్షపాతం నమోదు అవ్వడం. మేఘాల నుంచి ఒక్కసారిగా నీటి దార భూమి పైకి రావడాన్ని క్లౌడ్ బరెస్ట్ అంటారు. అయితే ఇది కేవలం నియమిత ప్రాంతంలో మాత్రమే జరుగుతుంది. ముఖ్యంగా 20 నుంచి 30చ.కి.మీ పరిధిలో గంటకు 10సెం.మీ వర్షపాతం నమోదవుతుంది. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా వరదలు వస్తాయి.
10 రోజుల క్రితం అమర్ నాథ్ యాత్రలో ఆకస్మికంగా భారీ వరదలు సంభవించాయి. దీనికి క్లౌడ్ బరెస్ట్ కావొచ్చని అక్కడి అధికారులు అంచనా వేశారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో క్లౌడ్ బరెస్ట్ అవుతాయాని, దీని వల్ల భారీ ప్రాణ, ఆస్తి జరుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. క్లౌడ్ బెరస్ట్ ఎక్కువగా పర్వత ప్రాంతాలలో ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్, లడఖ్‌లలో ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉందనన్నారు.
భారత వాతావరణశాఖ గణాంకాల ప్రకారం, 1970 నుంచి 2016 వరకు 30క్లౌడ్ బరస్ట్‌లు సంభవించాయి. 2002లో ఉత్తరాంచల్‌లో సంభవించిన కుంభవృష్టికి 28 మంది మృతి చెందారు. తెలంగాణలో క్లౌడ్ బరెస్ట్ కు అవకాశం చాలా తక్కువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలకు క్లౌడ్ బరెస్ట్ కారణం కాదని స్పష్టం చేశారు.
సాధారణంగా రుతు పవనాలు వచ్చేముందు ఇలాంటి భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. మే నుంచి జూలై-ఆగస్ట్ వరకు భారతదేశంలోని ఉత్తర ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తాయి. దక్షిణ భారతదేశంలో మాత్రం ఇటువంటి ఘటనలకు అవకాశం లేదు. కానీ కృత్రిమంగా క్లౌడ్ బరస్ట్ చేయాలని చూస్తే మాత్రం కచ్చితంగా ఇది సాధ్యమే.
అసలు క్లౌడ్ బరస్ట్ అంటే.ఒకటి నుండి పది కిలోమీటర్ల లోపు ఒక గంటలో 10 సెం.మీ లేదా అంతకంటే ఎక్కువ వర్షం(Rain) కురవడం. ఒక్కోసారి ఒకే ప్రాంతంలో ఒకటి కన్నా ఎక్కువసార్లు క్లౌడ్ బరస్ట్ లు సంభవిస్తాయి. అలాంటప్పుడు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. క్లౌడ్ బరస్ట్‌కు కారణాలు భౌగోళిక, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. పర్వతాలపై క్లౌడ్ బరస్ట్ సంఘటనలు అధికంగా జరుగుతుంటాయి. రుతుపవనాలు వచ్చే ముందు, వచ్చిన తరువాత కూడా క్లౌడ్ బరస్ట్ జరుగుతుంటుంది. తెలంగాణలో 5వందల ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా కడెం ప్రాజెక్టు క్యాచ్‌మెంట్ ఏరియాలో 30 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ప్రాజెక్ట్‌కు కలలో కూడా ఊహించనంతా వరద పోటెత్తింది. కేసీఆర్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. కచ్చితంగా దీనివెనుక ఏదో ఒక కుట్ర దాగుండే అవకాశం ఉందంటున్నారు. 2013లో ఉత్తరాఖండ్‌లో వరదలు పోటెత్తడంతో భారీగా ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగింది. దీనికి కూడా క్లౌడ్ బరస్ట్ కారణమన్న అనుమానాలూ ఉన్నాయి. అదే సమయంలో కుంభవృష్టి కురిసిన ప్రతిసారీ దానిని క్లౌడ్ బరస్ట్ అని చెప్పలేం.
ప్రకృతి వైపరీత్యాలను కూడా చైనా లాంటి దేశాలు తమకు అనుకూలంగా వినియోగించుకుంటున్నాయన్న వాదన కూడా ఒకటి ఉంది. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలను కృత్రిమంగా సృష్టించగలిగే.. టెక్నాలజీ డ్రాగన్ దగ్గర ఉంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్ సమయంలో చైనా ఇదే చేసింది. ఒలింపిక్స్‌కు ఒక్కరోజు ముందు.. అన్నీ గ్రౌండ్స్‌లో వాటర్ లీకేజీని పరిశీలించేందుకు చైనా కృత్రిమ వర్షాలను సృష్టించింది. అప్పుడే అర్థమైంది ఈ టెక్నాలజీ సాయంతో చైనా తన శత్రు దేశాల్లో కృత్రిమంగా ప్రకృతి విపత్తులు సృష్టించే అవకాశం ఉందని అప్పట్లోనే అంచనా వేశారు. ఇప్పుడు చైనా అదే పనిలో ఉందన్న సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే 1970 నుంచి 2016 మధ్య జమ్ముకశ్మీర్, లెహ్‌తో పాటు ఉత్తరాఖండ్‌లోని పెహల్గామ్ నుండి సుదూరంగా తూర్పున ఉన్న అరుణాచల్‌ప్రదేశ్ వరకు 30 క్లౌడ్ బరస్ట్‌లు సంభవించాయి. దీని కారణంగా సుమారుగా 20వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అన్నీ క్లౌడ్ బరస్ట్‌లకు చైనానే కారణమని చెప్పలేం కానీ.. కచ్చితంగా ఇందులో కొన్ని క్లౌడ్ బరస్ట్‌ల పాపం డ్రాగన్‌దేనన్న వాదనలు ఉన్నాయి. ఇప్పుడు గోదావరిలోనూ క్లౌడ్ బరస్ట్ కుట్ర జరుగుతోందన్న కేసీఆర్ వ్యాఖ్యలతో అందరి చూపు చైనాపై పడుతోంది.
మే నుంచి ఆగస్ట్ వరకు మన దేశంలో క్లౌడ్ బరస్ట్ ఘటనలు జరిగే అవకాశం ఉంది. ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయి. కొండ ప్రాంతాల్లో మాత్రమే ఈ తరహా ఘటనలు జరుగుతాయి. దక్షిణ భారతదేశంలో మాత్రం ఇటువంటి ఘటనలకు అవకాశం లేదు. కశ్మీర్, ఉత్తరాఖండ్‌లో తరచుగా సంభవించే ఫ్లాష్ ఫ్లడ్స్‌కు కారణం ఇవే. ఇక, విదేశీ కుట్ర అంటే.. క్లౌడ్ బరస్ట్ సంభవించడానికి అవసరమైన వాతావరణ పరిస్థితులను కృత్రిమంగా సృష్టించడం ద్వారా నష్టం కలిగించే ప్రయత్నం చేయడం. దీన్ని వెదర్ మాడిఫికేషన్ లేదా వెదర్ కంట్రోల్ గా వ్యవహరిస్తారు. అంటే వాతావరణాన్ని ఉద్దేశపూర్వకంగా నియంత్రించడం. వాతావరణ నియంత్రణకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వినిపించే పదబంధం.. క్లౌడ్ సీడింగ్. అంటే మేఘాల్లోకి సిల్వర్ అయోడైడ్‌ను పంపించడం ద్వారా కృత్రిమంగా వర్షాలు కురిపించడం. 2008 బీజింగ్ ఒలింపిక్స్ సమయంలో క్లౌడ్ సీడింగ్ ద్వారా.. గేమ్స్‌కు ముందే వర్షాలను కురిపించడం ద్వారా చైనా ఆ ఆటలకు అడ్డం లేకుండా చేసింది. అప్పట్నుంచి క్లౌడ్ సీడింగ్ అనే మాట విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. కానీ.. ఆ ఒలింపిక్స్‌కు ముందు చాలాకాలం నుంచే చైనా వాతావరణ సంస్థ క్లౌడ్ సీడింగ్ చేసేది. దేశంలోని నదుల్లో నీరు తగ్గిపోకుండా చూడడానికి, పంటపొలాలకు అవసరమైన నీరు అందించడానికి ఆ విభాగం చైనావ్యాప్తంగా పెద్ద ఎత్తున పనిచేసేది. చేస్తోంది. అందుకే.. లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో క్లౌడ్ బర్‌స్టలకు కారణం చైనాయేనన్న ఆరోపణలు వినిపిస్తుంటాయి.
చైనా కన్నా చాలా దశాబ్దాల ముందే.. అమెరికాలో క్లౌడ్ సీడింగ్ జరిగింది. మేఘాల్లోకి క్రష్డ్ డ్రై ఐస్‌ను చల్లగలిగితే మంచువాన కురుస్తుందని విన్సెంట్ జోసెఫ్ షేఫర్ అనే అమెరికన్ కెమిస్ట్ కనిపెట్టారు. జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ పరిశోధన విభాగంలో పనిచేసే షేఫర్.. 1946, నవంబరు 13న బెర్క్‌షైర్ కొండల్లో తొలిసారి క్లౌడ్ సీడింగ్ చేసి చూపారు.
1947లో ప్రాజెక్ట్ సిర్రస్ పేరుతో అమెరికా వాతావరణ నియంత్రణలో భాగంగా తుఫాన్ల తీవ్రతను తగ్గించే ప్రయత్నాలు చేసింది. జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ, అమెరికా ఆర్మీకి చెందిన సిగ్నల్ కోర్, నేవల్ రిసెర్చ్ విభాగం, వైమానిక దళం ఇందులో భాగమయ్యాయి. ఆ ఏడాది అక్టోబరు 13న వారు ఒక తుఫాను తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేయగా.. అది దారి మార్చుకుని వేరే చోట కుంభవృష్టి కురిపించింది. దీంతో ఆ ప్రాజెక్టును రద్దు చేశారు. ఆ తర్వాత మళ్లీ 1962-83 నడుమ ప్రాజెక్ట్ స్టార్మ్ ఫ్యూరీ పేరిట.. తుఫాన్ల తీవ్రతను తగ్గించేందుకు క్లౌడ్ సీడింగ్ విస్తృతంగా చేశారు. అవేవీ పెద్దగా ఫలించకపోవడంతో ఆ ప్రయత్నాలు మానుకున్నారు. ఆ తర్వాత క్లౌడ్ సీడింగ్ విధానం నిర్ణీత ప్రాంతాల్లో వర్షాలు కురిపించడానికి మాత్రమే ఉపయోగపడుతోంది. అదీ అంత సులభం కాదు. ఒక ప్రాంతంలో ఈ పద్ధతిలో వర్షం కురిపించాలంటే అక్కడి గాలిలో తగినంత నీటి ఆవిరి ఉండాలి. నీటి ఆవిరి లేకుంటే క్లౌడ్ సీడింగ్ వల్ల ఉపయోగం ఉండదు. పైగా క్లౌడ్ సీడింగ్ ద్వారా ఒక ప్రాంతంలో వర్షం కురిపించాలంటే.. కింద నుంచి మేఘాల్లోకి సిల్వర్ అయోడైడ్ పార్టికల్స్‌ను షూట్ చేయాలి. లేదా విమానాల ద్వారా మేఘాల పైనుంచి ఆ పనిచేయాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏది జరిగినా ఆ ప్రాంతవాసులకు ఆ విషయం తెలుస్తుంది. క్లౌడ్ సీడింగ్ పరిమితి చాలా తక్కువ. కాబట్టి ఈ పద్ధతిలో ఎవరికీ తెలియకుండా రహస్యం క్లౌడ్ బరస్ట్ లను సృష్టించడం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు.
మరి ఇందులో కుట్ర కోణం ఇంకేమై ఉంటుంది అంటే.. అమెరికా ప్రభుత్వం వియత్నాం యుద్ధ సమయంలో ఆ దేశంలో చేపట్టిన ఆపరేషన్ సోబర్ పొపేయే గురించి కొందరు గుర్తుచేస్తున్నారు. దీన్ని ప్రాజెక్ట్ కంట్రోల్డ్ వెదర్ పొపేయే లేదా మోటార్‌పూల్ గా కూడా వ్యవహరిస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే.. ఇది అమెరికా సైన్యం చేపట్టిన క్లౌడ్ సీడింగ్. పెద్ద ఎత్తున వానలు కురిపించి వియత్నాం సైనికులకు ఆహారం, ఆయుధాలు అందకుండా అడ్డుకోవడమే అమెరికా లక్ష్యం. కానీ, అది యుద్ధరంగం కాబట్టి, అమెరికా సేనలు బహిరంగంగానే ఆ పని చేశాయి. ఇలాంటి ప్రయోగాలను రహస్యంగా చేయడం కష్టం. ఈ నేపథ్యంలో.. అమెరికానే చేస్తున్న హార్ప్ అనే మరో ప్రయోగం గురించి కొందరు ప్రస్తావిస్తున్నారు.
హార్ప్ అంటే.. హై ఫ్రీక్వెన్సీ యాక్టివ్ అరోరల్ రిసెర్చ్ ప్రోగ్రామ్. భూ ఊపరితలం నుంచి గగనతలంలో ఎత్తుకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలు, ఇతర మార్పుల ఆధారంగా వాతావరణాన్ని శాస్త్రజ్ఞులు ఐదు రకాలుగా విభజించారు. వీటిని భూ ఆవరణాలు అంటారు. అవి.. ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మీసో ఆవరణం, థర్మో ఆవరణం, ఎక్సో ఆవరణం. వీటిలో థర్మో ఆవరణం 80కి.మీ. నుంచి 400 కి.మీ. ఎత్తువరకూ ఆవరించి ఉంటుంది. ఈ ఆవరణంలో వాయువులు అయాన్ల రూపంలో ఉండడంతో దీన్ని ఐనో ఆవరణంగా కూడా వ్యవహరిస్తారు. ఈ ఆవరణంలో ఆక్సిజన్, నైట్రోజన్ల నిరంతర రసాయనిక చర్యల వల్ల కాంతిపుంజాలు ఏర్పడతాయి. ఆ కాంతిపుంజాలనే మనం అరోరాలుగా వ్యవహరిస్తాం. స్కాండినేవియన్ దేశాల్లో కనిపించే అరోరా బొరియోలిస్ అంటే ఈ కాంతిపుంజాలే. రేడియో కమ్యూనికేషన్స్‌కు అత్యంత కీలకం ఈ ఆవరణమే. అందుకే.. ఈ ఆవరణంపై పరిశోధనలు జరిపేందుకు అమెరికా అలస్కాలో హార్ప్ కింద 1993లో ఒక అబ్జర్వేటరీని ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా శాస్త్రజ్ఞులు రేడియో ట్రాన్స్‌మిటర్ల ద్వారా రేడియో బీమ్‌లను పంపి ఆ ప్రాంతానికి పై భాగంలో ఉన్న గాలిని వేడి చేస్తుంటారు. దానివల్ల భూ ఉపరితల వాతావరణంలో జరిగే మార్పులను పరిశీలిస్తుంటారు. అయితే ఈ ప్రాజెక్టులోని సంక్లిష్టతల నేపథ్యంలో చాలా మంది దీన్ని వాతావరణ నియంత్రణ ప్రాజెక్టుగా పొరబడుతుంటారు. ప్రపంచంలో ఎక్కడ దావానలం చెలరేగినా, వరదలు, తుఫాన్లు సంభవించినా.. వాటన్నింటికీ కారణం ఇదేనని కుట్ర కోణాన్ని తెరపైకి తెస్తుంటారు. ఈ ఆరోపణలకు మూలం.. 2010లో నాటి వెనెజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ చేసిన ఆరోపణ. అప్పట్లో హైతీని కుదిపేసిన తీవ్ర భూకంపానికి కారణం ఇదేనని ఆయన ఆరోపించారు. అప్పట్నుంచీ దీనిపై కాన్‌స్పిరసీ థియరీలు మొదలయ్యాయి. మన కేంద్ర పర్యావరణ శాఖ మాజీ మంత్రి, దివంగత అనిల్ మాధవ్ దవే 2016లో రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో కూడా దీని గురించి ప్రస్తావించారు. అమెరికా చేపట్టిన ఈ ఆయుధం విద్యుదయస్కాంత తరంగాలను భూ ఉపరితల వాతావరణంలోకి పంపిస్తోందని.. ఇది భూతాపానికి కారణమయ్యే అవకాశం ఉందని ఆయన అందులో పేర్కొన్నారు. కానీ.. ఈ ప్రాజెక్టులో భాగంగా ఉపయోగించే రేడియో ట్రాన్స్‌మిటర్ల ప్రభావం, పరిధి చాలా తక్కువ అని.. దీనివల్ల భూతాపం పెరగదని శాస్త్రజ్ఞులు స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు.. వేరే దేశాల్లో, కావాల్సిన చోట, కావాల్సిన ప్రకృతి ఉత్పాతాలు సృష్టించేంత శక్తి దీనికి లేదని వారు తేల్చిచెబుతున్నారు..
ఇప్పటిదాకా సాధించగలిగింద ఏదైనా ఉందంటే.. అది పరిమిత ప్రాంతంలో, అదీ వాతావరణం సహకరిస్తే మబ్బులు వర్షించేలా చేయడం, పొగమంచు పోయేలా చేయడం వంటివి మాత్రమేననే వాదన ఉంది. నానాటికీ పెరుగుతున్న భూతాపం ప్రకృతి ఉత్పాతాలకు కారణమవుతోందని శాస్త్రజ్ఞులు చాలాకాలంగా హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇటీవలికాలంలో సంభవిస్తున్న ప్రకృతి విపత్తులన్నీ అందులో భాగమేనని వారు పేర్కొంటున్నారు. అయితే దేశాల మధ్య విద్వేషాలు పెరిగిపోయి.. ఏకంగా ప్రకృతితో కూడా ఆటలాడుతున్నారన్న ఆలోచనే అందర్నీ భయపెడుతోంది. ఇవి ఇప్పటివరకు ఆరోపణలే అయినా.. ఒకవేళ నిజమైతే మాత్రం ప్రపంచానికి పెను సవాళ్లు తప్పవు.