రాష్ట్రంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రంజాన్ పండుగను పురస్కరించుకుని ప్రత్యేక ఆహ్వానం మేరకు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ఇంటికి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లారు.
తెలంగాణ కేబినెట్ భేటీ ఈ నెల 9న జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఎస్ శాంతికుమారి శనివారం అన్ని శాఖలకు సమాచారం ఇచ్చారు.
రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.
ఖమ్మంలో ఈ నెల 18న కనీవినీ ఎరగని స్థాయిలో బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్‌ఎస్ పార్టీ భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. దేశం మెచ్చేలా సభకు సన్నాహాలు చేస్తోంది. సభకు రెండు రోజుల ముందే ఖమ్మం నగరం భారీ కటౌట్లు, హోర్డింగ్‌లతో గులాబిమయమైంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం కరీంనగర్‌లో పర్యటించారు. ఇటీవల బీసీ సంక్షేమం, ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య మృతిచెందడంతో వారి కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శించారు.
మునుగోడు ఉపఎన్నికల వేళ బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటివరకు కమలదళంలో ఉన్న మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ బీజేపీకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నారు.
మునుగోడులో ఇవాళ్టి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ఆ నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్న కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ బీఫాంను ప్రగతిభవన్‌లో అందజేశారు.
బీఆర్ఎస్ జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన సందర్భంగా గురువారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను తమిళనాడు ఎంపీ, ప్రముఖ దళిత నేత, వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్‌తో వివిధ రాష్ట్రాల నాయకులు కలిశారు.