Vice President Election: తెలంగాణ రాష్ట్ర సమితి కీలక నిర్ణయం తీసుకుంది. విపక్ష పార్టీల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు మద్దతు ఇవ్వాలని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర రావు నిర్ణయం తీసుకున్నారు. రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. టీఆర్‌ఎస్‌కు చెందిన ఎంపీలందరూ మార్గరెట్ అల్వాకు ఓటు వేయాలని అధిష్ఠానం నిర్ణయించింది. మార్గరెట్ అల్వాకు 16 మంది టీఆర్‌ఎస్ ఎంపీలు ఓటేయనున్నారు. పార్లమెంట్ భవనంలో రహస్య బ్యాలెట్ విధానంలో రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలో మొత్తం 788 మంది ఎంపీలు ఓటేయనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఆర్వోగా లోక్‌సభ సెక్రటరీ జనరల్ వ్యవహరించనున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటనను టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు విడుదల చేశారు.
Reavnth Reddy: వెంకన్న మా వాడే.. రాజ్ గోపాల్ ద్రోహి..
ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లోనూ విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఉప రాష్ట్రపతి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కావడంతో కొంత అనుమానం తలెత్తింది. మమత బెనర్జీ తరహాలోనే ఎన్నికలకు దూరంగా ఉంటుందన్న ప్రచారమూ జరిగింది. అయితే చివరకు కాంగ్రెస్ అభ్యర్థి అయినా సరే ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ నిర్ణయించింది.
Telangana Rashtra Samithi (TRS) announces support for opposition candidate Margaret Alva for the vice-Presidential election pic.twitter.com/KG8zGVtdZq
— ANI (@ANI) August 5, 2022