అహింస సిద్ధాంతంతో గాంధీజీ.. బ్రిటీష్‌వారిపై పోరాడి విజయం సాధించారని సీఎం కేసీఆర్ కొనియాడారు. గాంధీ సిద్ధాంతం ఎప్పటికైనా విశ్వజనీనమని ఆయన అన్నారు. గాంధీ మార్గంలో తెలంగాణ సాధించుకున్నామని ఆయన తెలిపారు.
గాంధీజీ స్ఫూర్తితో శాంతియుత మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మహాత్మగాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
మునుగోడు ఉప ఎన్నిక కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చే ఎన్నిక కాబోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. కేసీఆర్ ఖేల్ కాబోతోందని...ఆయన దుకాణం బంద్ ఖాయమన్నారు. కేసీఆర్ తో లడాయికి సిద్ధమయ్యామని... ఎంఐఎతో కలిసి వచ్చినా బల ప్రదర్శనకు సిద్ధమని సవాల్ విసిరారు.
రాష్ట్రంలో టీఆర్‌ఎస్ నేతల సభలకు డబ్బులిచ్చి జనాలను తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడిందని మునుగోడు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్.. ఏం ఘనకార్యం చేశావని దేశ స్థాయిలో కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నావ్ అంటూ ఆయన ప్రశ్నించారు.
కేసీఆర్ అబద్ధాల గురించి ఎన్ని చెప్పినా తక్కువేనని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. ప్రజావ్యతిరేక నరహంతక తెరాస ప్రభుత్వానికి చరమ గీతం పాడాలని ఆదిలాబాద్ జిల్లాలోని గిమ్మ గ్రామంలో ఆయన వ్యాఖ్యానించారు.
కమ్యూనిస్టులు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారని .. భారత దేశం కోసం కాదని బీజేపీ నేత మురళీధర్ రావు అన్నారు. సొంత రాజ్యం ఏర్పాటు కోసం పోరాడారని.. దేశ భక్తితో మాత్రం కాదన్నారు.
కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కారం-2022కు డాక్టర్ పత్తిపాక మోహన్ ఎంపికయ్యారు. ఈ ఏడాదిగాను 22 మంది రచయితలకు బాలసాహిత్య పురస్కారాలు కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. పత్తిపాక మోహన్ రాసిన 'బాలలతాత బాపూజీ' గేయ కథకు ఈ పురస్కారం దక్కింది.