ఎన్నికలలో నిలబడే వివిధ రాజకీయ పార్టీల నాయకుల గుణగణాలు తెలుసుకుని ఓటు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి స్టేడియంలో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. రామగుండం నియోజకవర్గం అభివృద్ధి, ప్రజల భవిష్యత్ చూసి బీఆర్ఎస్‌కు ఓటు వేస�
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. పలు పార్టీల నుంచి కీలక నేతలు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. రేపు గజ్వేల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రి హరీశ్ రావు పరిశీలించారు.
బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కుల కోసమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంథనిలో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. దేశంలో రాజకీయ పరిణతి పెరగాలి.. ప్రజస్వామ్య పరిణతి వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు.
చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని మందమర్రిలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ గడ్డ చైతన్య వంతమైనదని, ఓటు విచక్షణతో వేయాలని ప్రజలను ముఖ్యమంత్రి కోరారు.
కామారెడ్డి నియోజకవర్గంపై బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. మొదటిసారిగా కామారెడ్డి నియోజకవర్గ నేతలతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. కామారెడ్డి జిల్లా జనగామకు చెందిన తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి సీఎంతో భేటీ అయ్యారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి నదికి ప్రత్యేక హారతి సమర్పించారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం విచ్చేసిన ముఖ్యమంత్రి పర్యటన అనంతరం రోడ్డు మార్గంలో తిరుగు ప్రయాణం అయ్యారు.
సింగరేణిని కాంగ్రెస్ సగం ముంచితే, బీజేపీ పూర్తిగా ముంచుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ వజ్రపుతునకగా ఉన్న సింగరేణిని రెండు పార్టీలు నాశనం పట్టించాయని మండిపడ్డారు. వికలాంగుల ఫించను మరో వెయ్యి పెంచుతున్నామని సీఎం కేసీఆర్ మంచిర్యాలలో జరిగిన ప్రగతి నివేదన సభలో ప్రకటించారు.
అమరుల త్యాగాలు గుర్తు చేసుకుంటూ, ప్రజల అకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, పండుగ వాతావరణంలో జరుపుకోవాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బ్రిటీష్ ఎంపీ వీరేంద్ర శర్మ అభినందించారు. హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.