Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్‌
  • Web Stories
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Vice President Of India
  • Common Wealth Games
  • Parliament Monsoon Session
  • Heavy Rains
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Telangana News Bandi Sanjay Comments On Basara Rgukt Students Agitation

Bandi Sanjay: ఇక్కడ ఇంత జరుగుతుంటే కేసీఆర్ ఢిల్లీకి పోయి ఏం చేస్తున్నాడు?

Published Date :July 31, 2022
By Mahesh Jakki
Bandi Sanjay: ఇక్కడ ఇంత జరుగుతుంటే కేసీఆర్ ఢిల్లీకి పోయి ఏం చేస్తున్నాడు?

Bandi Sanjay: తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ బాసర ఆర్జీయూకేటీలో శనివారం రాత్రి నుంచి విద్యార్థులు భోజనం చేయకుండా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం చేసేందుకు కూడా విద్యార్థులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆందోళన గురించి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడారు. బాసర ట్రిపుల్ ఐటీ విషయంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. దీనిపై బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తున్నారని పేర్కొన్నారు. రోజురోజుకూ ఈ సమస్య జటిలమవుతోందన్నారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని.. అయినా ఎవరూ పట్టించుకోలేదని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఐటీలో కనీసం మీడియాను కూడా అనుమతించడం లేదన్నారు.

ఫుడ్ పాయిజన్‌తో ఆస్పత్రి పాలైనా పట్టించుకోవడం లేదని.. భోజనం వండేందుకు కనీసం షెడ్లు కూడా సరిగ్గా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చిన విద్యా సంస్థలను కాపాడుకునే తెలివి కేసీఆర్‌కి లేదన్నారు. ఇక్కడ ఇంత జరుగుతుంటే కేసీఆర్ ఢిల్లీకి పోయి ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం మొత్తం ఎక్కడ పోయిందని చర్చించుకుంటున్నారని అన్నారు. సోయం బాపురావు ఆధ్వర్యంలో సమస్యలు పరిశీలించేందుకు వర్సిటీకి వెళ్తే ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. ఆయన స్థానిక ఎంపీ. ఆయన్ను కూడా పంపించరా అంటూ మండి పడ్డారు. మీరు, మీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎలాగు వెళ్లరు.. స్థానిక ఎంపీ వెళ్తే అరెస్టులా అంటూ ఆగ్రహించారు. ఢిల్లీకి తెలంగాణ ప్రజల కోసం వెళ్లావా.. మీ సొంత పనులకు పోయారా అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు.

పోలీసులు బీజేపీ నాయకుల కాళ్లపై నుంచి కార్లు ఎక్కిస్తున్నారని.. బీజేపీ నాయకులను చంపే కుట్ర చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. పోలీసులు ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారని ఆరోపణలు చేశారు. భైంసా ఘటన రిపీట్ చేయాలని చూస్తున్నారని ఆయన అన్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు ముఖ్యమంత్రికి భయపడుతున్నారని చెప్పారు. సోయం బాపురావును పోలీసులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు చేతకాకుంటే వర్సిటీని తమకు అప్పగించాలని.. తామే సమస్యలను పరిష్కరిస్తామన్నారు. విద్యార్థులకు నీళ్ల చారుతో భోజనం పెడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Basara: “బాసర” అంటే బాధ మాత్రమే కాదు. ఈ విజయగాథ కూడా..

విద్యార్థుల ఆందోళనకు కారణం: ఇటీవల ఆర్జీయూకేటీలో ఆహారం వికటించి పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులు భోజనశాల నిర్వాహకుల లైసెన్స్‌ రద్దు చేయడంతో పాటు నూతన నిర్వాహకులను నియమించి నాణ్యతగా భోజనం అందించాలంటూ ఇన్‌ఛార్జి ఉపకులపతి వెంకటరమణకు ఇటీవల విన్నవించారు. దీంతో పాటు మరికొన్ని డిమాండ్లనూ వీసీ దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమస్యలను 24వ తేదీలోపు పరిష్కరిస్తామని ఇన్‌ఛార్జి వీసీ వారికి భరోసా ఇచ్చారు. గడువు ముగిసి ఐదు రోజులు పూర్తయినా డిమాండ్లను నెరవేర్చక పోవడంతో విద్యార్థులు శనివారం రాత్రి నుంచి ఆందోళనకు దిగారు.

  • Tags
  • bandi sanjay
  • Bandi Sanjay comments
  • Bandi Sanjay on cm kcr
  • basara iiit students agitation
  • basara rgukt students agitation

WEB STORIES

జుట్టు రాలుతోందా.. ఈ చిట్రాలు పాటిస్తే సరి!

"జుట్టు రాలుతోందా.. ఈ చిట్రాలు పాటిస్తే సరి!"

బ్రోకలీ రెగ్యులర్‌గా తింటే.. ఎన్నో లాభాలు

"బ్రోకలీ రెగ్యులర్‌గా తింటే.. ఎన్నో లాభాలు"

Just For Fun: ఇది మీకోసం కాదు.. అయినా ఇంత తేడానా..?

"Just For Fun: ఇది మీకోసం కాదు.. అయినా ఇంత తేడానా..?"

Chikoti Praveen:  చికోటి ప్రవీణ్‌..? ఆసక్తికరమైన విషయాలు..!

"Chikoti Praveen: చికోటి ప్రవీణ్‌..? ఆసక్తికరమైన విషయాలు..!"

ప్రపంచంలోని 10 ఎత్తైన విగ్రహాలు

"ప్రపంచంలోని 10 ఎత్తైన విగ్రహాలు"

Badam Tea: బాదం టీతో ఎన్నో లాభాలు

"Badam Tea: బాదం టీతో ఎన్నో లాభాలు"

Dulquer Salmaan: హీరో కాకపోయుంటే డ్రైవర్ని అయి ఉండేవాడిని

"Dulquer Salmaan: హీరో కాకపోయుంటే డ్రైవర్ని అయి ఉండేవాడిని"

Naga Chaitanya: నా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు?  చిరాకేస్తుంది

"Naga Chaitanya: నా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు? చిరాకేస్తుంది"

ఏయే పండ్లలో ఎంత షుగర్ ఉంటుందంటే..?

"ఏయే పండ్లలో ఎంత షుగర్ ఉంటుందంటే..?"

యాలకులు రోజూ తీసుకుంటే.. ఎన్నో లాభాలు

"యాలకులు రోజూ తీసుకుంటే.. ఎన్నో లాభాలు"

RELATED ARTICLES

Bandi Sanjay : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మగ్గాలకు జియో టాగ్ ఇస్తాం

Niti Aayog: ప్రధాని మోడీ అధ్యక్షతన నేడు నీతి ఆయోగ్ పాలక మండలి భేటీ

Bandi Sanjay: మోదీని ఎదుర్కొనే ముఖం లేకే కేసీఆర్ నీతి ఆయోగ్ సమావేశానికి గైర్హాజరు.

Bandi Sanjay : జాతీయ భావాలు ఉన్న వ్యక్తి దాసోజు శ్రావణ్

Bandi Sanjay:ఘర్ వాపసీ.. దాసోజు శ్రవణ్‌ బీజేపీలోకి వెల్ కం

తాజావార్తలు

  • Independence day Celebration: ఈ నెల 30 వరకు తస్మాత్ జాగ్రత్త. ‘ఇంటలిజెన్స్’ హెచ్చరిక

  • Sixty years For Swarna Manjari :అరవై ఏళ్ళ ‘స్వర్ణమంజరి’

  • COVID 19: ఇండియాలో పెరిగి కోవిడ్ కేసులు, మరణాలు.. కొత్తగా ఎన్నంటే..

  • KTR Tweets: ఇంకా ఎంతమంది మిగిలారు..?

  • Cricket: అత్యుత్సాహమే పాక్ కొంపముంచుతోంది.. భారత్ గెలుపుపై పాక్ బ్యాటర్ కామెంట్స్

ట్రెండింగ్‌

  • Common Wealth Games @india: కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు భారీగా బంగారం

  • Friendship Day 2022: కులమతాలకు అతీతం.. పేద, ధనిక తేడా తెలియని బంధం..!!

  • Vice President Salary: ఉప రాష్ట్రపతి ఎంత వేతనం అందుకుంటారు? ఎలాంటి సదుపాయాలు లభిస్తాయి?

  • KCR Press Meet: రేపటి నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా: సీఎం కేసీఆర్

  • Amazon Great Freedom Sale : అదిరిపోయే ఆఫర్స్‌.. టీవీలపై భారీ డిస్కౌంట్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions