Tammineni Veerabhadram: తెలంగాణలో రాజకీయ వేడి ఎక్కువగా ఉందని, ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం జరుగుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రజా సమస్యల గురించి ఏ పార్టీ మాట్లాడకుండా రాజకీయాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో 8 ఏళ్లలో ఏ ఒక్క ప్రధాన డిమాండ్ కూడా నెరవేరలేదని ఆయన ఆరోపించారు. కేసీఆర్ సంక్షేమ పథకాలు గట్టెక్కించే పరిస్థితి లేదన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రభావం తగ్గించడంలో కేసీఆర్ విజయం సాధించారని అన్నారు. కేసీఆర్ బీజేపీని వ్యతిరేకిస్తూ మంచి పని చేస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Central Minister Kishan Reddy: అతిపెద్ద సోలార్ ప్రాజెక్టు తెలంగాణలో ఉండటం గర్వకారణం
బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ మాట్లాడుతున్నారనే కారణంతో సీపీఎం టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోదని తమ్మినేని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రజాస్వామ్యయుతంగా ధర్నాలు,సభలు పెట్టుకునే స్వేచ్ఛ కూడా ఇవ్వట్లేదని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ భయంలో ఉన్నారని.. మహారాష్ట్ర పరిణామాల తరువాత కేసీఆర్‌కు నిద్ర పడుతుందో లేదో అని వెల్లడించారు. చాలా మంది షిండేలు ఉన్నారని బీజేపీ ప్రచారం చేస్తోందని ఆయన చెప్పారు.