Pakistan: పాకిస్థాన్ పరిస్థితి ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్థాన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, దాని నుంచి కోలుకునేందుకు ఎంతకైనా దిగజారేందుకు సిద్ధంగా ఉంది.
Gaming Addiction:మొబైల్ గేమింగ్ ఎంత ప్రమాదకరం ఇటీవల కొన్ని సంఘటనలు తెలియజేస్తున్నాయి. ఈ గేమింగ్స్ కు పిల్లలు బానిస అవుతున్నారు. తల్లిదండ్రలుకు తెలియకుండా వారి ఖాతాల నుంచి డబ్బులు గేమ్స్ కోసం తగలేస్తున్నారు. ఇటు ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యంగా తీవ్రం నష్టపోతున్నారు.
తైవాన్ పై చైనా తన యుద్ధాన్ని విరమించుకున్నట్టు లేదు. ఇప్పటికీ తైవాను ఆక్రమించుకోవడానికి చైనా శతవిధాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. చైనాకి చెందిన 37 యుద్ధ విమానాలు తైవాన్ లోకి ప్రవేశించాయి.
Tiananmen Square: స్వేచ్ఛ కోసం నినదించిన ప్రజలను అత్యంత దారుణంగా అణిచివేసి, వేల మందిని నిర్ధాక్షిణ్యంగా చంపేసిన తియాన్మెన్ స్వేర్ ఊచకోతకు 34 ఏళ్లు నిండాయి. తమకు ఎదురుతిరిగితే ఏ రకంగా ప్రవర్తిస్తుందనే ఉదంతాన్ని తియాన్మెన్ స్వేర్ రూపంలో చైనా చూపించింది. ఎలాంటి కనికరం లేకుండా సైన్యంతో కాల్పులు జరిపింది, యుద్ధ ట్యాంకులతో ప్రజలను అణిచివేసింది.
ఎప్పుడూ ఏదో ఒక భారీ ప్రయోగం చేసే చైనా.. ఒకే రోజు రెండు భారీ సైన్సు ప్రాజెక్టులను ప్రారంభించింది. మంగళవారం ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపగా.. మరోవైపు షింజియాంగ్ ప్రావిన్స్‌లో అత్యంత లోతైన బోర్ తవ్వకానికి శ్రీకారం చుట్టింది. ఈ బోర్ లోతు 10,000 మీటర్లు ఉండనుంది.
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రైవేట్ జెట్ చైనాలోని బీజింగ్ క్యాపిటల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో కనిపించింది. ఎలాన్ మస్క్ ఉపయోగించే ప్రైవేట్ జెట్ బీజింగ్‌కు చేరుకుందని రాయిటర్స్ పేర్కొంది.
అంతరిక్ష పరిశోధనలో పశ్చిమ దేశాలతో పోటీ పడుతున్న చైనా మరో ముందడుగు వేసింది. దేశాల మధ్య అంతరిక్ష పోటీ పెరుగుతున్న నేపథ్యంలో చంద్రుడిపై శాస్త్రీయ అన్వేషణ కోసం 2030 నాటికి మానవ సహిత మిషన్‌ను పంపాలని డ్రాగన్ భావిస్తోంది. చంద్రునిపై పరిశోధనలు చేయడానికి 2030లో వ్యోమగాములను పంపనున్నట్లు చైనా సోమవారం ప్రకటించింది.
China: మద్యపానం అతిగా తాగితే హానికరం. గతంలో తెలుగు రాష్ట్రాల్లో మద్యపానంపై ఛాలెంజ్ చేసి మితిమీరిన మద్యం తాగిన వ్యక్తులు మరణించిన సంఘటనలు జరిగాయి. తాజాగా చైనాలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇలాగే అతిగా తాగి మరణించాడు. లైవ్ స్ట్రీమింగ్ సమయంలో 7 బాటిళ్ల వోడ్కాను తాగాడు, చివరకు 12 గంటల్లోనే మరణించాడు. జైబియు అని పిలువడబే చైనీస్ వోడ్కాను తాగినట్లు సీఎన్ఎన్ నివేదించింది.
Speed Train : భారతీయ రైల్వే శరవేగంగా విస్తరిస్తోంది. రాజధాని-శతాబ్ది రైళ్లు ఇప్పుడు చరిత్రగా మారుతున్నాయి. గత కొద్ది రోజులుగా దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు తీస్తోంది.