ప్రస్తుతం ఆన్ లైన్ హవా కొనసాగుతుంది. ప్రతీ వస్తువు ఆన్ లైన్ లోనే దొరుకుతోంది. అనేక వస్తువులను మనం ఇలా ఆర్డర్ చేస్తే.. ఈ కామర్స్ సంస్థలు అలా డెలివరీ చేస్తున్నాయి. ఆన్ లైన్ లో చివరికి మెడిసిన్స్ కూడా దొరుకుతున్నాయి. ఇంకా లక్షల రూపాయల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను సైతం ఆన్ లైన్ లోనే వినియోగదారులు ఆర్డర్ చేస్తున్నారు. ఈ కామర్స్ సంస్థలపై పెరిగిన నమ్మకం.. వారి అందిస్తున్న సేవలు, కస్టమర్ సపోర్ట్ ఇందుకు కారణంగా చెప్పొచ్చు.
Read Also : Mehbooba Mufti: “జై శ్రీరాం” నినాదాలు చేయాలని ముస్లింలను సైన్యం బలవంతం చేసింది..
అయితే, ఆర్డర్ చేసిన రోజే డెలివరీ ఎప్పుడో చేస్తారో కూడా ఈ ఆన్ లైన్ సంస్థలు చెబుతాయి. ఇంకా.. ఆన్ లైన్ ట్రాకింగ్ లాంటి సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతమైతే ఈ-కామర్స్ సంస్థలు దాదాపు వారం, పది రోజుల్లోనే డెలివరీ చేస్తున్నాయి. అయితే.. విచిత్రంగా ఓ వ్యక్తి ఓ వస్తువును ఆర్డర్ చేసిన నాలుగేళ్లకు ఓ ఈ కామర్స్ సంస్థ డెలివరీ చేసింది. ఢిల్లీకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నితిన్ అగర్వాల్ చైనాకు చెందిన ఈ-కామర్స్ వేదిక ఆలీ ఎక్స్ ప్రెస్ నుంచి కరోనా ప్రారంభానికి ముందే ఓ వస్తువును ఆర్డర్ చేశాడు.
Read Also : KTR: తర్వలో జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు.. ఈ ప్రక్రియ అల్లం నారాయణకు అప్పగించామన్న కేటీఆర్
అయితే ఆ వస్తువు నాలుగేళ్ల తర్వాత డెలివరీ అయ్యింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ లో వెల్లడించడంతో.. అది కాస్తా.. వైరల్ అవుతుంది. దీంతో నితీన్ అగర్వాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఎవరూ ఆశలు కోల్పోవద్దు.. ఎప్పుడో ఒకసారి మీ వస్తువులూ డెలివరీ అవుతాయి అంటూ తన ట్విట్టర్ పోస్టులో పేర్కొన్నాడు. ఈ విషయం వైరల్ గా మారడంతో నెటిజెన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.
Read Also : Actress Jyothi: కేపీ చౌదరి డ్రగ్స్ కేసుపై నటి జ్యోతి రియాక్షన్.. ఆ హక్కు ఎవరిచ్చారు?
2017-19 మధ్యకాలంలో నేను చాలా ఆర్డర్లు చేశాను.. బిల్లులన్నీ ఉన్నాయి.. వాటి కోసం ఎదురు చూస్తున్నాను అంటూ ఓ యూజర్ ట్వీట్ చేశారు. ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన వస్తువులన్నీ ఏదో ఓ సమయానికి డెలివరీ అవుతాయన్న నమ్మకం వచ్చిందని ఓ యూజర్ అన్నాడు. ఇదిలా ఉంటే.. జాతీయ భద్రతను కారణంతో.. 2020లో భారత ప్రభుత్వం ఆలీ ఎక్స్ ప్రెస్ ను బ్యాన్ చేసింది. అయితే.. ఈ సంస్థను నిషేధించక ముందే నితిన్ అగర్వాల్ ఈ వస్తువును కొనుగోలు చేశారు. అయితే.. తాను ఏ వస్తువును కొన్నది మాత్రం అతను వెల్లడించలేదు.