ఎప్పుడూ ఏదో ఒక భారీ ప్రయోగం చేసే చైనా.. ఒకే రోజు రెండు భారీ సైన్సు ప్రాజెక్టులను ప్రారంభించింది. మంగళవారం ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపగా.. మరోవైపు షింజియాంగ్ ప్రావిన్స్‌లో అత్యంత లోతైన బోర్ తవ్వకానికి శ్రీకారం చుట్టింది. ఈ బోర్ లోతు 10,000 మీటర్లు ఉండనుంది.
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రైవేట్ జెట్ చైనాలోని బీజింగ్ క్యాపిటల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో కనిపించింది. ఎలాన్ మస్క్ ఉపయోగించే ప్రైవేట్ జెట్ బీజింగ్‌కు చేరుకుందని రాయిటర్స్ పేర్కొంది.
అంతరిక్ష పరిశోధనలో పశ్చిమ దేశాలతో పోటీ పడుతున్న చైనా మరో ముందడుగు వేసింది. దేశాల మధ్య అంతరిక్ష పోటీ పెరుగుతున్న నేపథ్యంలో చంద్రుడిపై శాస్త్రీయ అన్వేషణ కోసం 2030 నాటికి మానవ సహిత మిషన్‌ను పంపాలని డ్రాగన్ భావిస్తోంది. చంద్రునిపై పరిశోధనలు చేయడానికి 2030లో వ్యోమగాములను పంపనున్నట్లు చైనా సోమవారం ప్రకటించింది.
China: మద్యపానం అతిగా తాగితే హానికరం. గతంలో తెలుగు రాష్ట్రాల్లో మద్యపానంపై ఛాలెంజ్ చేసి మితిమీరిన మద్యం తాగిన వ్యక్తులు మరణించిన సంఘటనలు జరిగాయి. తాజాగా చైనాలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇలాగే అతిగా తాగి మరణించాడు. లైవ్ స్ట్రీమింగ్ సమయంలో 7 బాటిళ్ల వోడ్కాను తాగాడు, చివరకు 12 గంటల్లోనే మరణించాడు. జైబియు అని పిలువడబే చైనీస్ వోడ్కాను తాగినట్లు సీఎన్ఎన్ నివేదించింది.
Speed Train : భారతీయ రైల్వే శరవేగంగా విస్తరిస్తోంది. రాజధాని-శతాబ్ది రైళ్లు ఇప్పుడు చరిత్రగా మారుతున్నాయి. గత కొద్ది రోజులుగా దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు తీస్తోంది.
చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. జూన్ మాసంలో అదికాస్త గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. జూన్ చివరి వారం కల్లా దాదాపు 6.5 కోట్ల మంది ఈ వ్యాధి బారినపడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరించారు.
AI face-swapping: ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ట్రెండ్ నడుస్లోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు తన జీవితాలను మరింత సులభతరంగా మార్చుకోవడానికి ఈ సాంకేతికత మరింతగా సాయపడుతోంది.
Rishi Sunak: ప్రపంచ భద్రతకు, శ్రేయస్సుకు చైనా అతిపెద్ద సవాల్ గా ఉందని, అయితే ఆదే సమయంలో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు దాని నుంచి పూర్తిగా విడిపోవడానికి ప్రయత్నించకూడదని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అన్నారు. జపాన్ లోని హిరోషిమా వేదికగా జీ-7 సమావేశాలకు ఆయన హజరయ్యారు.
G20 Meeting: జమ్మూ కాశ్మీర్ విషయంలో దాయాది దేశం పాకిస్తాన్ కు వంత పాడుతోంది చైనా. మరోసారి భారతదేశంపై తన అక్కసును వెళ్లగక్కింది. పర్యాటక రంగంపై జీ 20 వర్కింగ్ గ్రూప్ మూడో సదస్సు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో నిర్వహించాడాన్ని చైనా వ్యతిరేకిస్తోంది. శ్రీనగర్ లో ఈ నెల 22 నుంచి 24 వరకు మూడు రోజలు పాటు సభ్యదేశాలతో సమావేశం జరుగనుంది.
PM Modi: బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్, జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని ఎత్తేయడం తర్వాత నుంచి భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. పాకిస్తాన్, భారత్ లో వాణిజ్య సంబంధాలను కూడా కట్ చేసుకుంది. అయితే దీని ఫలితాలను పాకిస్తాన్ అనుభవిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా భారత్-పాకిస్తాన్ సంబంధాల గురించి ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.