China: ప్రస్తుత కాలంలో ఉద్యోగం దొరకడమే కష్టం.. అలాంటిది దొరికిన ఉద్యోగాన్ని చేసుకోకుండా, వాటికి రాజీనామా చేయాలంటే మనదేశంలో అయితే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. కానీ చైనాలో మాత్రం విచిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. అక్కడి యువత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను వదిలేస్తోంది. లక్షల జీతాలు వచ్చే, ఏసీల కింద కూర్చుండి పనిచేసే ‘వైట్ కాలర్’ ఉద్యోగాలను వదిలేసి వాటి స్థానంలో మామూలు ఉద్యోగాలైన వెయిటర్స్, చెఫ్స్, క్లీనర్లుగా మారిపోతున్నారు.
గాంగ్‌డాంగ్ ప్రావిన్సులో పనిచేసే ఓ యువతి అంతకుముందు బైట్‌డ్యాన్స్ సంస్థలో పనిచేసేది. కాగా ప్రస్తుతం ఆమె ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్‌లో వంట చేయడంతో పాటు సేల్స్ విభాగాన్ని చూసుకుంటుంది. తాను ఉద్యోగాన్ని వీడిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నానని చెప్పింది. కొత్త జాబ్ తో తాను రోజుకు 140 డాలర్లు సంపాదిస్తున్నానని చెప్పింది. కొత్త ఉద్యోగం వల్ల శరీరం అలసిపోతుంది కానీ, తన మనసు ప్రశాంతంగా ఉంటుందని వెల్లడించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. దీనికి ‘ మై ఫస్ట్ ఫిజికల్ ఎక్స్‌పీరియన్స్’ అనే హ్యాష్ ట్యాగ్ జోడించింది.
Read Also: Kathua Case: కథువా అత్యాచారం-హత్య కేసులో ప్రధాన నిందితుడిపై విచారణ..
ఇదే విధంగా మరో మహిళ కన్సల్టింగ్ జాబ్ వదిలేసుకుని, కాఫీ షాప్ లో పనిచేస్తోంది. ‘‘నాకు ఏమాత్రం సంబంధం లేని ఫలితం కోసం నేను ఇంతకాలం పనిచేశాను దాంతో నాలో శూన్యత ఏర్పడింది. మనల్ని భాగస్వాముల్ని చేసే శారీరక శ్రమ నాలో కొత్త శక్తినిస్తోంది. ఈ పనిచేయడం సరదాగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది. ఈమెయిల్స్, ఇంటర్వ్యూలు, పీపీటీలతో విసిగిపోయినట్లు మరొకరు వెల్లడించారు.
ఇలా చైనా యువత వైట్ కాలర్ జాబ్స్ వదిలేసి, ఫిజికల్ వర్క్ జాబ్స్ వైపు వెళ్తోంది. సంస్థలో ఉద్యోగం కోసం కాకుండా.. యాంత్రికంగా పనిచేయించడం కోసం తమను తీసుకున్నారని చాలా మంది యువత నిరాశ చెందడవం వల్లే ఇలా జరుగుతోందని ‘న్యూయార్క్ యూనివర్సిటీ షాంఘై’లో సోషియాలజీ విభాగం అధ్యాపకులు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో గతేడాది నుంచి చైనాలో ‘‘my first physical work experience’’ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.