Beijing: ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరైనా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ నేడు చైనాలో.. ఆ దేశ అధ్యక్షుడు చైనా అధ్యక్షులు జిన్‌పింగ్‌తో భేటీ కానున్నారు. మలేరియా మరియు క్షయవ్యాధిపై పోరాడటానికి చైనా చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా తమ ఫౌండేషన్ నుంచి సహాయం చేయడానికి ముందుకొచ్చిన నేపథ్యంలో బిల్ గేట్స్ చైనా అధ్యక్షుడితో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. బిల్ గేట్స్ ఫౌండేషన్ నుంచి వ్యాదులపై చైనా ప్రభుత్వం చేస్తున్న పోరాడటానికి సహాయం చేయడానికి 50 మిలియన్ల అమెరికా డాలర్లను ఇవ్వనున్నారు.
Read also: Foxconn EV Factory: భారత ఈవీ మార్కెట్‌లోకి ప్రవేశించనున్న ఆపిల్ ఐఫోన్ తయారీ కంపెనీ
చైనాను సందర్శించిన అనేక మంది విదేశీ వ్యాపారవేత్తల్లో బిల్‌గేట్స్ కూడా ఉన్నారు. చైనా దేశం కఠినమైన కోవిడ్ నియంత్రణలను ముగించుకుందని.., దాదాపు మూడు సంవత్సరాల పాటు ప్రపంచం నుండి చైనాకు రాకపోకలు మూసివేయబడిన విషయం తెలిసిందే. గత నాలుగు సంవత్సరాలలో చైనా దేశానికి వచ్చిన మొదటి వ్యాపారవేత్త బిల్ గేట్స్. చైనా దేశాధినేత మరియు విదేశీ వ్యాపారవేత్త మధ్య అరుదైన ఒప్పందం జరిగే అవకాశం ఉంటుందని చైనా ప్రభుత్వ మీడియా శుక్రవారం తెలిపింది. శుక్రవారం చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్‌తో బీజింగ్‌లో బిల్ గేట్స్ ఫౌండేషన్ హెడ్ అయిన బిల్ గేట్స్‌తో సమావేశమవుతారని ప్రభుత్వం తెలిపింది. ఈ పర్యటన అనంతరం ఇదే నెలలో రానున్న ఆదివారం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చైనాలో పర్యటించనున్నారు.
Read also: Indigo Airlines: ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం.. ఐదు రోజుల్లో ఇది రెండోసారి
తాము చేయనున్న 50 మిలియన్ల అమెరికా డాలర్ల సహాయం ..ప్రపంచంలోని అత్యంత పేదలను అసమానంగా ప్రభావితం చేసే క్షయ మరియు మలేరియా వంటి అంటు వ్యాధుల నుంచి ప్రాణాలను రక్షించే చికిత్సల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య ఫలితాలను మెరుగుపరిచే ప్రయత్నాలకు మద్దతు ఇస్తున్నట్టు అని గేట్స్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. మలేరియా నిర్మూలన మరియు పేదరికం తగ్గింపులో చైనా చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసిస్తున్నట్టు గేట్స్ ఫౌండేషన్ తెలిపింది. చైనాలో పేదరికాన్ని తగ్గించడంతో ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడం ద్వారా చైనా గణనీయమైన లాభాలను సాధించిందఅని బిల్‌గేట్స్ చెప్పారు. ప్రస్తుత సవాళ్లను.. ముఖ్యంగా ఆఫ్రికన్ దేశాలు ఎదుర్కొంటున్న వాటిని పరిష్కరించడంలో చైనా మరింత పెద్ద పాత్ర పోషిస్తుందని తాను ఆశిస్తున్నానట్టు బిల్ గేట్స్ చెప్పారు. బిల్ గేట్స్ చివరిసారిగా 2019లో చైనాను సందర్శించారు. అక్కడ HIV/AIDS నివారణలో తన ఫౌండేషన్ యొక్క పని గురించి చర్చించడానికి ప్రథమ మహిళ పెంగ్ లియువాన్‌తో సమావేశమయ్యారు.