చైనా తనతో మాట్లాడాలనుకుంటోందని టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా చెప్పారు. టిబెటన్ ప్రజల బలమైన స్ఫూర్తిని గ్రహించిన చైనా తనను సంప్రదించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు.
భూమిపైనే అత్యంత వేడి రోజుగా జులై 3 రికార్డును నమోదు చేసింది. ఈ విషయాన్ని అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ శాఖ తెలిపింది. జులై 3వ తేదీన భూఉపరితలానికి 2 మీటర్ల ఎత్తులోని గాలి సగటు ఉష్ణోగ్రత 62.62 డిగ్రీల ఫారెన్‌హీట్ లేదా 17.01 సెల్సియస్‌కు చేరుకుందని వెల్లడించింది.
ఓ చైనా కంపెనీ ఉద్యోగులతో ప్రవర్తించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది. టార్గెట్లు పూర్తిచేయని ఉద్యోగులతో కంపెనీ యాజమాన్యం బలవంతంగా కాకరకాయలను తినిపించింది. ఈ ఘటన చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది. టార్గెట్‌ను పూర్తి చేయడంలో విఫలమైన ఎంప్లాయిస్ తో సదరు కంపెనీ పచ్చి కాకరకాయలను తినిపించింది.
అద్దెకు తల్లిదండ్రులు దొరుకుతుండటంతో పిల్లలను చూసుకునేందుకు ఆ దేశంలోని పేరేంట్స్ చిల్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. ఈ వినూత్న సేవలు చైనాలో మొదలై, ప్రజల నుంచి ఎంతో ఆదరణ పొందుతుంది. ముఖ్యంగా ఈ సేవలు చిన్నపిల్లలను చూసుకోలేని తల్లుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే ఉద్యోగాలు చేసుకునే వారికి పిల్లలను చూసుకునేందుకు సమయం లేనివారికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సేవల కారణంగా పలువురు తల్లులు తమ పిల్లలను అద్దె డాడీలకు అప్పగించి, వాళ్లు చిల్…
ఒక సభ్యుడు ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నంత కాలం భారతదేశం సార్క్ (సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్) సమావేశాన్ని నిర్వహించలేమని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బుధవారం తెలిపారు. రాత్రిపూట ఉగ్రవాదం, పగటిపూట వ్యాపారం జరిగే పరిస్థితిని భారతదేశం సహించదని పాకిస్థాన్‌పై జైశంకర్ మండిపడ్డారు.
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడ వణికించిన సంగతి అందరికీ తెలిసిందే. లక్షల మంది ప్రాణాలను బలిగొన్న మహమ్మారి ఎలా పుట్టిందనే అంశంపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కరోనా మనుషులకు ఎందుకు సోకింది అనే మూడేళ్లుగా సమాధానం లేని ప్రశ్నపై.. చైనాలో వుహాన్ నగరంలోని... వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన ఓ పరిశోధకుడు... ఆశ్చర్యకరమైన విషయాన్ని తెరపైకి తెచ్చారు.
Srilanka: చైనాతో తమకు ఎలాంటి సైనిక ఒప్పందాలు లేవని శ్రీలంక తటస్థంగా ఉంటుందని ఆ దేశ అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే అన్నారు. శ్రీలంక భూభాగాన్ని భారతదేశానికి వ్యతిరేఖంగా ఎప్పటికీ వాడుకోనివ్వం అని ఆయన స్పష్టం చేశారు. ఒక టెలివిజన్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
గాడిద చర్మాలు సహా వివిధ వస్తువులను చైనాకు ఎగుమతి చేసే ప్రతిపాదనలకు పాకిస్థాన్ సర్కార్ ఆమోద ముద్ర వేసింది. పాకిస్థాన్ నుంచి పశువులు, పాల ఉత్పత్తులు, మిరపకాయలు, గాడిద చర్మాలను డ్రగన్ కంట్రీకి ఎగుమతి చేసే ప్రతిపాదనలను పాక్ ఫెడరల్ క్యాబినెట్ సర్క్యులేటింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
భారత్ ఇప్పుడిప్పుడే వివిధ వ్యాపార రంగాల్లో చైనాకు సవాల్ విసురుతోంది. మొదట స్మార్ట్ఫోన్ల విషయంలో యాపిల్ వంటి కంపెనీ భారతదేశానికి రావడం.. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో సెమీకండక్టర్ తయారీకి మిర్కాన్ అంగీకరించడం. అంతేకాకుండా ఎలక్ట్రిక్ కారును తయారు చేయడానికి టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ భారతదేశానికి రావడానికి అంగీకరించారు. ఈ విధంగా చైనా వ్యాపారాన్ని భారతదేశం సెలెక్టివ్‌గా సవాలు చేస్తోంది. ఇప్పుడు చైనా భారత్చే 'లాండరింగ్'గా భావిస్తున్న మరో రంగం కూడా…