Warming World: భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ గ్యాసెస్ ఎక్కువ కావడంతో గత కొన్ని దశాబ్ధాలుగా భూగోళం ఉష్ణోగ్రతల్లో మార్పు వస్తోంది. కర్భన ఉద్గారాల విడుదల కూడా ఇందుకు ఓ కారణం అవుతోంది. వేడిగా ఉండే దేశాలు మరింత వేడిగా మారుతున్నాయి. సమశీతోష్ణ దేశాలు ఊహించని విధంగా ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటున్నాయి. ధృవాల వద్ద మంచు వేగంగా కరిగిపోతుంది. ఇదే జరిగితే కొన్నేళ్లలో సముద్రతీర ప్రాంతాల్లో ఉండే నగరాలు కనుమరుగు అవుతాయి.
China: చైనాలో మానవహక్కులకు పెద్దగా విలువ ఉండదు. చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని కానీ, ఆ దేశ నేతలను కానీ విమర్శిస్తే.. విమర్శించిన వారు తెల్లారేసరికే మాయం అవుతారు. వారి ఆచూకీ దశాబ్ధాలు గడిచిన కనిపించదు. అంతగా నిర్భందం ఉంటుంది అక్కడ. ఇక చైనీస్ పీపుల్ లిబరేషన్ ఆర్మీ గురించి చెప్పే పని లేదు. సరిహద్దు దేశాలతో ఎప్పుడూ గిల్లికజ్జాలు పెట్టుకుంటూనే ఉంటుంది. అయితే చైనా ఆర్మీని మాత్రం విమర్శిస్తే అక్కడి పాలకులు ఊరుకోరు.
Tea plantations: ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ డ్రింక్ గా పేరు తెచ్చుకున్న టీ చరిత్రను పరిశీలిస్తే.. ఎన్నో మలుపులు.. మరెన్నో విజయాలు. కమ్మని రుచితో తమను కట్టిపడేసిన టీని కాపాడుకోవడానికి చైనీయులు చేస్తున్న కృషి అభినందనీయం!
Tesla: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా భారత్ వైపు చూస్తోంది. అమెరికా, చైనాల మధ్య ఏర్పడిని ఘర్షణ, భారత్ వంటి అతిపెద్ద మార్కెట్ ను వదులుకునేందుకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఏ సంస్థ ఇష్టపడటం లేదు. ఇప్పుడున్న భారత ప్రభుత్వం, రానున్న రోజుల్లో చైనాకు ధీటుగా తయారీ రంగంలో భారత్ ను అగ్రగామిగా నిలిపేందుకు పనిచేస్తోంది. మరోవైపు చైనా, భారత సంబంధాలు కూడా చెప్పుకోదగిన రీతిలో లేవు. దీంతోనే భారత్ వైపు టెస్లా దృష్టిసారిస్తున్నట్లు తెలుస్తోంది.
Lithium: ప్రపంచంలో ప్రస్తుతం అత్యంత ఖరీదైన, విలువైన ఖనిజంగా ఉన్న లిథియం నిల్వలు భారతదేశంలో బయటపడుతున్నాయి. కొన్ని నెలల క్రితం జమ్మూ కాశ్మీర్ లోని రియాసి జిల్లాలో భారీ లిథియం నిల్వలను కనుగొన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) వెల్లడించింది. ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్ తర్వాత రాజస్థాన్ లో కూడా లిథియం నిల్వలను కనుగొన్నారు. నాగౌర్ జిల్లాలోని దేగానాలో ఈ లిథియం నిల్వలు కనుగొన్నట్లు తెలిపింది.
మిస్టరీగా మారిన చైనాకు చెందిన అంతరిక్ష నౌక ఇవాళ ( సోమవారం ) తిరిగి భూమి పైకి వచ్చింది. దాదాపు 276 రోజుల ఈ వ్యోమనౌక ఇవాళ తిరిగి వచ్చిందని చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది.
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో జరిగిన సమావేశంలో చైనా, తాలిబన్ల మధ్య కీలక ఒప్పందం జరిగింది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ను ఆఫ్ఘనిస్తాన్కు విస్తరించడానికి తాలిబన్ చైనా, పాకిస్తాన్తో అంగీకరించింది. ఆంక్షలతో దెబ్బతిన్న ఆఫ్ఘనిస్తాన్ దేశంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి బిలియన్ల డాలర్లు సమకూరే అవకాశం ఉంది.
SCO Meeting: షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సిఓ) విదేశాంగ మంత్రుల సమావేశానికి గోవా ఆతిథ్యం ఇవ్వనుంది. మే 4-5 తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలను పరిశీలించేందుకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బుధవారం గోవాలకు చేరుకున్నారు. ఎస్సీఓ సభ్యదేశాల్లో ఒకటైన పాకిస్తాన్ దేశ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ కూడా ఈ సమావేశాలకు హాజరుకానున్నారు.
తూర్పు చైనాలోని కెమికల్ ప్లాంట్లో పేలుడు సంభవించి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు తప్పిపోయారని, మరొకరు గాయపడ్డారని స్థానిక ప్రభుత్వం సోమవారం తెలిపింది.