PM Modi: గల్వాన్ ఘర్షణ, సరిహద్దుల్లో సైనిక మోహరింపు తరువాత భారత్, చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. తాజాగా రెండు దేశాల మధ్య సంబంధాలపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. చైనాతో సాధారణ ద్వైపాక్షిక సంబంధాలకు సరిహద్దు ప్రాంతాల్లో శాంతి మరియు ప్రశాంతత అవసరమని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. మంగళవారం అమెరికా పర్యటనకు బయలుదేరిన ప్రధాని నరేంద్రమోడీ వాల్ స్ట్రీట్ జర్నల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం, చట్ట నియమాలను పాటించడం, విభేదాలు, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడంలో మాకు నమ్మకం ఉందని, అదే సమయంలో భారత్ తన సార్వభౌమాధికారాన్ని, గౌరవాన్ని పరరక్షించడంలో కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Read Also: Bihar: టోల్ ప్లాజా దగ్గర రూ. 50 కొట్టేశాడని సెక్యూరిటీ గార్డ్ ను చంపిన దుండగులు
2020లో భారత్-చైనా సరిహద్దుల్లో గాల్వాన్ ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో పదుల సంఖ్యలో భారత జవాన్లు మరణించారు. ఆ తరువాత భారత దళాల దాడిలో కూడా చాలా మంది చైనా సైనికులు చనిపోయినట్లు ఇతర దేశాలు తెలిపాయి. అయితే చైనా మాత్రం కేవలం ఇద్దరు మాత్రమే చనిపోయినట్లు క్లెయిమ్ చేసింది. 2000 కిలోమీటర్ల పొడవైన సరిహద్దులో ఇటు భారత్, అటు చైనా బలగాలు మోహరించి ఉన్నాయి. శాంతి నెలకొల్పే లక్ష్యంతో ఇప్పటి వరకు ఇరు దేశాల సైనికుల మధ్య 18 రౌండ్ల సైనిక చర్యలు జరిగాయి.
ఇదిలా ఉంటే ప్రధాన మోడీ అమెరికా పర్యటనపై చైనా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తోంది. తన అక్కసును వెళ్లగక్కుతోంది. భారత్ ను ఉపయోగించుకుని చైనాను అడ్డుకోవాలని అమెరికా చూస్తోందని, ఆ ట్రాప్ లో భారత్ పడొద్దని సూచించింది. చైనా వాణిజ్యాన్ని, భారత్ తో సహా మరే ఇతర దేశం కూడా భర్తీ చేయలేదని తన మౌత్ పీస్ గ్లోబల్ టైమ్స్ లో ఓ కథనంలో పేర్కొంది.