టీమిండియా జెర్సీలపై పాక్ పేరును తొలగించాలంటూ గతంలో పలువురు క్రికెట్ అభిమానులు డిమాండ్ చేసినప్పటికీ.. బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. టోర్నీ సమయంలో క్రికెట్ బోర్డు, భారత జట్టు.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆదేశాలకు కట్టుబడి ఉంటుందని తేల్చి చెప్పారు.
ICC Champions Trophy 2025: ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రేపటి నుంచి ప్రారంభం కానుంది. కరాచీలో జరిగే మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ పాకిస్తాన్- న్యూజిలాండ్‌తో తలపడటంతో టోర్నమెంట్ ప్రారంభమవుతుంది.
దాయాదుల మధ్య జరిగే బ్లాక్ బస్టర్ పోరులో గొప్ప ప్రదర్శన చేసే ప్లేయర్స్ ఎవరో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, పాక్ మాజీ కెప్టెన్లు ఇంజమామ్, షాహిద్ అఫ్రిదీ తెలియజేశారు. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున శుభ్‌మన్ గిల్ అత్యధిక రన్స్ చేస్తాడని.. అటు బౌలింగ్ లో మహమ్మద్ షమీఎక్కువ వికెట్లు తీస్తాడని యువీ పేర్కొనగా.. పాకిస్థాన్ వైపు బ్యాట్‌తో బాబర్ అజామ్ .. బాల్ తో షాహిన్ అఫ్రిదీ ఆకట్టుకుంటారని అఫ్రిదీ చెప్పుకొచ్చాడు.
Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు భారత్ కు తీవ్ర అవమానం జరిగింది. కరాచీలోని నేషనల్ స్టేడియంలో భారత జెండా కనిపించకపోవడంతో తీవ్ర వివాదానికి దారి తీసింది. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే ఇతర దేశాల జెండాలు వేదిక దగ్గర కనిపించినప్పటికీ.. భారత జెండా మాత్రం కనిపించలేదు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమిండియా శనివారం సాయంత్రం దుబాయ్ చేరుకుంది. ఆదివారం భారత జట్టు ప్రాక్టీస్ సెషన్ ప్రారంభించి.. ఐసీసీ అకాడమీలో తమ శిక్షణను కొనసాగించింది. అయితే ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడ్డాడు. ఆదివారం ఐసీసీ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు రిషబ్ పంత్ ఎడమ మోకాలికి గాయమైంది.
తాజాగా విడుదల చేసిన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ నెం.1గా నిలిచింది. ఇంగ్లండ్‌ను క్లీన్ స్వీప్ చేయడంతో టీమిండియా 119 రేటింగ్‌లో మొదటి స్థానంలో ఉంది.
Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలాయి. 19 ఫిబ్రవరి నుంచి ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈ సమయంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) టోర్నీకి సంబంధించిన ప్రైజ్ మనీని ప్రకటించింది. ఈసారి 8 జట్ల మధ్య జరుగనున్న ఈ టోర్నమెంట్ కోసం ఐసీసీ భారీ ప్రైజ్ మనీని ప్రకటించింది. విశేషం ఏమిటంటే, గత చాంపియన్స్ ట్రోఫీతో పోలిస్తే ఈసారి ప్రైజ్ మనీ 53% పెరిగింది. 8 సంవత్సరాల…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఏకంగా ఐదుగురు స్టార్ ప్లేయర్స్ దూరమయ్యారు. గాయాల కారణంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, పేసర్ జోష్ హేజిల్‌వుడ్, ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ వైదొలగగా.. ఆల్‌రౌండర్ మార్కస్ స్టాయినిస్ అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ కూడా తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో స్టార్క్ టోర్నీకి దూరమయ్యాడు. కీలక ఆటగాళ్లు దూరమైన నేపథ్యంలో 15 మంది సభ్యుల జట్టులో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) పలు మార్పులు చేసింది. గాయం కారణంగా…
అందరూ ఊహించిందే జరిగింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడడం లేదు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2025 చివరలో గాయపడ్డ బుమ్రా.. ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. వెన్ను గాయం వల్ల బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడని బీసీసీఐ మంగళవారం రాత్రి ఎక్స్‌లో తెలిపింది. అతడి స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకున్నట్లు పేర్కొంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం జనవరిలో ప్రకటించిన జట్టులో జస్ప్రీత్…
2025 ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. 8 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 19 నుండి ప్రారంభమవుతుంది. ఈ ఐసిసి ఈవెంట్ కోసం భారత జట్టును ప్రకటించారు. అయితే, భారత జట్టులో చోటు దక్కించుకున్న స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా గాయం ఇప్పటికీ భారత జట్టుకు ఆందోళన కలిగించే అంశంగా మిగిలిపోయింది.