ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది. ఈ ట్రోఫీ ఆరంభోత్సవాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కలిసి ఫిబ్రవరి 16న లాహోర్‌లో నిర్వహించనున్నాయి. ఈ కార్యక్రమంకు చారిత్రక లాహోర్ కోటలోని హుజూరి బాగ్ వేదిక కానుంది. అయితే ఐసీసీ టోర్నీ ఆరంభానికి ముందు సంప్రదాయంగా వస్తున్న అన్ని జట్ల కెప్టెన్ల ఫొటోషూట్, మీడియా సమావేశాన్ని ఈసారి నిర్వహించడం లేదని తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ప్రధాన జట్లు…
వరల్డ్ వైడ్ గా క్రికెట్ కు ఎలాంటి క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. పనులన్నీ వదులుకుని మ్యాచ్ చూసేందుకు రెడీ అవుతుంటారు క్రికెట్ ఫ్యాన్స్. మ్యాచ్ ఎక్కడ జరిగినా స్టేడియాల్లో వాలిపోతుంటారు. క్రికెట్ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫిబ్రవరి 19న ప్రారంభం కానున్నది. పాకిస్థాన్ , దుబాయ్ వేదికలుగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. అయితే ఈ ఈవెంట్ కు సంబంధించిన టికెట్ల వివరాలను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, పాకిస్తాన్…
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. పాకిస్తాన్‌లో ట్రోఫీ జరగనుండగా.. భారత్ మ్యాచ్‌లు మాత్రం దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఎనిమిదేళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుండడంతో ప్రతి టీమ్ టైటిల్ సాధించాలని చూస్తోంది. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నాయకత్వంలో చివరిసారిగా 2013లో భారత్ ట్రోఫీ సాధించింది. ప్రస్తుతం రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు కప్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్…
బీసీసీఐ యుజ్వేంద్ర చాహల్ కెరీర్‌ను దాదాపుగా క్లోజ్ చేసింది.. అలా ఎందుకు జరిగిందనేది అర్థం చేసుకోవడం కష్టమే అన్నారు ఆకాశ్ చోప్రా. ఇక, యూజీ చివరిసారిగా 2023 జనవరిలో వన్డే మ్యాచ్‌లో ఆడాడు. అప్పటి నుంచి నేటి వరకు అతడు ఆడలేదు.
Champions Trophy 2025: శ్రీలంకలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత దివ్యాంగ క్రికెట్ టీమ్ అద్భుత విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 79 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత జట్టు, టోర్నమెంట్ విజేతగా నిలిచింది. భారత దివ్యాంగ క్రికెట్ కౌన్సిల్ (DCCI) ఈ గెలుపును అధికారికంగా ప్రకటిస్తూ.. జట్టు సమిష్టి కృషిని కొనియాడింది. ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ…
ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్, వన్డే సిరీస్‌తో పాటు ఆ తర్వాత జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి అతడు ఎంపికయ్యాడు. షమీ రీ ఎంట్రీ ఇస్తుండటంతో టీమిండియా మాజీ ప్లేయర్ సౌరభ్ గంగూలీ సంతోషం వ్యక్తం చేశారు. అతడి రాకతో భారత జట్టు బలం గణనీయంగా పెరిగిందన్నారు.
భారత జట్టును ఎంపిక చేయడమంటే సెలక్టర్లకు చాలా కష్టమైన పని.. అందులో 15 మందితో స్క్వాడ్ అంటే ఇంకా ఇబ్బందిగా ఉంటుదని భజ్జీ చెప్పుకొచ్చాడు. కానీ, దేశవాళీలో అదరగొట్టిన వారికి అవకాశం కూడా కల్పించకపోలేకపోయారని వాపోయాడు.
హైబ్రిడ్ మోడల్‌లో పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి 15 మంది సభ్యులతో కూడిన జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రకటించింది. టీమ్ ఇండియా కెప్టెన్ పగ్గాలను రోహిత్ శర్మకే అప్పగిస్తూ.. బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ ముఖ్యమైన టోర్నమెంట్‌కు యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మాన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. పవర్ ఫుల్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ తిరిగి అరగేట్రం చేశాడు. వెన్ను గాయంతో బాధపడుతున్న.. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా…
Champions Trophy 2025: బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును ప్రకటించనుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మీడియా ముందుకు వచ్చి జట్టులోని సభ్యుల వివరాలను వెల్లడించనున్నారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతల గురించి ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు మైఖేల్ అథర్టన్, నాసిర్ హుస్సేన్ తమ అంచనాలను వెల్లడించారు. మైఖేల్ అథర్టన్ మాట్లాడుతూ.. " దక్షిణాఫ్రికాకు మద్ధతిస్తున్నాను. ప్రతి టోర్నమెంట్‌లో గెలిచే వరకు పోరాడతారు. సౌతాఫ్రికా జట్టు బలంగా ఉంది. ఈ ట్రోఫీని దక్షిణాఫ్రికా సొంతం చేసుకుంటుంది." అని మైఖేల్ అథర్టన్ తెలిపాడు. మాజీ ఇంగ్లీష్ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఛాంపియన్స్ ట్రోఫీలో ఈసారి భారత్, ఆస్ట్రేలియాలు ఫైనల్‌కు చేరుకుంటాయని అభిప్రాయపడ్డాడు. అంతే…