IND vs PAK: అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్లో పాకిస్థాన్‌పై టీమిండియా ఆధిపత్యం కొనసాగుతుంది. చాలా ఏళ్లుగా భారత్‌తో మ్యాచ్ అంటే ఒత్తిడంతా పాక్ పైనే ఉంటుంది. పైగా ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో తమ మొదటి మ్యాచ్ ఓడి, సంక్లిష్ట స్థితిలో భారత్‌తో తలపడేందుకు సిద్ధమైంది దాయాది జట్టు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా నేడు ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. రెండు జట్ల మధ్య మ్యాచ్ లాహోర్‌లో జరుగుతోంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు.. ఇరు జట్లు మైదానానికి చేరుకున్నాయి. జాతీయ గీతాలు ప్లే చేయడం మొదలు పెట్టారు. గ్రౌండ్ మేనేజ్‌మెంట్ ఆస్ట్రేలియా జాతీయ గీతానికి బదులుగా భారత జాతీయ గీతాన్ని ప్లే చేసింది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. ఆదివారం భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. ఈ ఆసక్తికర పోరు కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. అటు.. క్రికెట్ అభిమానులతో పాటు, మాజీ క్రికెట్ దిగ్గజాలు, ప్రముఖులు, సెలబ్రిటీలు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన అభిప్రాయాన్ని తెలిపారు. ఐసీసీ టోర్నమెంట్లలో పాకిస్తాన్‌పై భారత్ అద్భుతమైన రికార్డును కొనసాగిస్తుందని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో ఐఐటీ బాబాకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో అతను ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ గురించి ఒక అంచనా వేశాడు. అతను భారత జట్టు ఓటమి గురించి మాట్లాడాడు. దీంతో.. టీమిండియా ఫ్యాన్సే కాకుండా.. పాకిస్తాన్ అభిమానులు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరుగుతోంది. పాకిస్తాన్‌లోని కరాచీలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 315 పరుగులు చేసింది. దీంతో.. ఆఫ్ఘాన్ ముందు 316 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఎన్నో ముఖ్యమైన మ్యాచ్‌లు ఆడాడు. 2007 టీ20 ప్రపంచ కప్ ఫైనల్, 2011 ప్రపంచ కప్ సెమీఫైనల్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ల్లో యువరాజ్ ముందుండి నమ్మకంగా ఆడాడు. అయితే.. పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్ గురించి ఆయన మాట్లాడుతూ, "ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడూ ఫైనల్ లాగా అనిపిస్తుందని తెలిపారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. నేడు ఆఫ్ఘనిస్తాన్-దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరుగుతుంది. పాకిస్తాన్‌లోని కరాచీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముందుగా సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా గెలుపుతో శుభారంభం చేసింది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి గ్రూప్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. మహ్మద్ షమీ ఐదు వికెట్లు పడగొట్టడంతో బంగ్లాదేశ్ 228 పరుగులకే ఆలౌట్ అయింది. ఛేజింగ్‌లో రోహిత్ శర్మ మెరుపు బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. 36 బంతుల్లో 41 పరుగులు చేసి టీమిండియాకు చక్కటి ఆరంభాన్ని ఇచ్చాడు. ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్లో…
Champions Trophy 2025: 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ఇండియా విజయంతో శుభారంభం చేసింది. గురువారం జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 6 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే, ఈ విజయంతో అందరూ సంతోషంగా ఉన్న.. అక్షర్ పటేల్‌కు మాత్రం కొంత అసంతృప్తి మిగిలింది. హ్యాట్రిక్‌కు ఒక్క వికెట్ దూరంలో ఉన్న అతడు, కెప్టెన్ రోహిత్ శర్మ క్యాచ్ వదిలేయడం కారణంగా గొప్ప అవకాశాన్ని కోల్పోయాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో అక్షర్ 9వ ఓవర్‌లో వరుసగా రెండు వికెట్లు తీసి…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 229 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్ల తేడాతో గెలిచింది. 46.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది.