గత సంవత్సరం బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుండి తొలగించబడి.. కెరీర్‌లో గడ్డుకాలాన్ని ఎదుర్కొన్న మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్‌కు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. మార్చి 2025కి గాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును శ్రేయాస్ గెలుచుకున్నాడు. ఈ విషయాన్ని ఐసీసీ మంగళవారం ప్రకటించింది. జాకబ్ డఫీ, రచిన్ రవీంద్రలను అధిగమించి మరీ శ్రేయాస్ ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో శ్రేయస్ 243 పరుగులు చేసి.. భారత్…
భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం జట్టులో చోటు లభించకపోవడంపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. తొలుత ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయానని.. కానీ జట్టు ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాన్ని అర్థం చేసుకున్నానని సిరాజ్ తెలిపాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. రూ.58 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వనుంది. ఆటగాళ్లతో పాటు సిబ్బంది, సెలక్షన్ కమిటీకి ఈ నగదు అందజేయనున్నట్లు తెలిపింది.
Varun Chakravarthy: భారత క్రికెట్ జట్టు స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణించి అందరి ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీలో టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండవ బౌలర్‌గా కూడా అతడు నిలిచాడు. అతను కేవలం మూడు మ్యాచ్‌ల్లో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. అయితే, గత కొన్ని సంవత్సరాలు తనకి చాలా కష్టంగా గడిచాయని, 2021 T20 ప్రపంచ కప్‌లో తన పేలవమైన ప్రదర్శన కారణంగా తనకు ఫోన్‌లో…
పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత్.. 12 ఏళ్ల తర్వాత ట్రోఫీని సొంతం చేసుకుంది. ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా రోహిత్ సేన కప్‌ను దక్కించుకుంది. ఇప్పటికే ఐసీసీ ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’ను ప్రకటించింది. భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా తన బెస్ట్ టీమ్‌ను వెల్లడించాడు. తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ కూడా తన ప్లేయింగ్ 11ను ప్రకటించాడు.…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని భారత్ గెలిచిన విషయం తెలిసిందే. సెమీస్‌లో ఆస్ట్రేలియాను, ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి.. గత ఐసీసీ టోర్నీ పరాభవాలకు బదులు తీర్చుకుంది. అయితే దుబాయ్‌లోనే అన్ని మ్యాచ్‌లు ఆడడంతోనే.. టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిందని పలువురు మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు అన్నారు. పిచ్ అడ్వాంటేజ్ భారత జట్టుకు కలిసొచ్చిందని అభిప్రాయపడ్డారు. అయితే ఈ వాదనలను ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కొట్టిపడేశాడు. పిచ్ అడ్వాంటేజ్ అనేది అర్థరహితమని, భారత్ బాగా…
ఐసీసీ 2025 ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఫైనల్లో న్యూజిలాండ్‌ని ఓడించి.. మూడోసారి ట్రోఫీని అందుకుని రికార్డు సృష్టించింది. అయితే ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒక పరుగుకే ఔట్ అయ్యాడు. మైఖేల్ బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు. దాంతో విరాట్ ఫాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. కింగ్ ఔట్ అవ్వగానే ఓ 14 ఏళ్ల బాలిక గుండెపోటుకు గురై చనిపోయిందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.…
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025లో భారత్ ఓటమి ఎరుగని జట్టుగా సత్తాచాటుతూ.. టైటిల్ ను కైవసం చేసుకుంది. మార్చి 9న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో టీం ఇండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి క్రికెట్ చరిత్రలో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. 19 రోజుల పాటు జరిగిన ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ తో ముగిసింది. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత భారత జట్టు స్వదేశానికి తిరిగి వచ్చింది. ఇక ఇప్పుడు నెక్ట్స్…
దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో భారత్ గెలిచిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌పై 4 వికెట్ల తేడాతో గెలిచి విజేతగా నిలిచింది. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకోవడంలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించారు. దుబాయ్ పిచ్ స్పిన్‌కు అనుకూలించడంతో భారత్ ఏకంగా నలుగురితో బరిలోకి దిగింది. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.. స్పిన్ ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఆకట్టుకున్నారు. టోర్నీలో భారత్ స్పిన్నర్లు 26 వికెట్లు తీశారు.…
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీస్, ఫైనల్స్‌లో మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫైర్ అయిన విషయం తెలిసిందే. బాల్ వేసిన అనంతరం స్టంప్స్ వెనకే ఉండడం, ఫీల్డర్ త్రో విసిరినా బంతిని పట్టుకోకపోవడంతో ఆగ్రహానికి గురయ్యాడు. ఫైనల్ మ్యాచ్‌లో 41వ ఓవర్‌లో రవీంద్ర జడేజా మెరుపు వేగంతో బంతిని వేయగా.. వికెట్లకు దగ్గర నుంచి వెళ్తున్న బంతిని కుల్దీప్ పట్టుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. సెమీస్‌లో స్టీవ్ స్మిత్…