ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లో 228 పరుగులు చేసింది. భారత్ ముందు 229 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది.
భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేసి వరల్డ్ రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతను మూడో వికెట్ సాధించిన వెంటనే అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అతి తక్కువ బంతుల్లో 200 వికెట్లు తీసిన బౌలర్‌గా ఒక కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ రికార్డుతో ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్‌ను అధిగమించాడు.
ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ వేసిన ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. అయితే.. అదే ఓవర్‌లో మరో వికెట్ పడాల్సింది. మరో వికెట్ పడి ఉంటే.. ఈరోజు చరిత్రలో మిగిలిపోయేది. వన్డే అంతర్జాతీయ క్రికెట్‌లో హ్యాట్రిక్ సాధించి, భారత ఆటగాళ్ల ప్రత్యేకమైన జట్టులో చేరేవాడు. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన తప్పిదం కారణంగా అక్షర్ పటేల్ హ్యాట్రిక్ సాధించలేకపోయాడు.
సొంతగడ్డపై జరుగుతున్న 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌కు మంచి ఆరంభం లభించలేదు. టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌లోనే పాకిస్తాన్ జట్టు 60 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవి చూసింది. మొదటి మ్యాచ్‌లోనే ఓడిపోయిన పాకిస్తాన్ జట్టుకు మరో బిగ్ షాక్ తగిలింది. బ్యాటర్ ఫఖర్ జమాన్ గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ జట్ల మరికొద్దిసేపట్లో మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ షాంటో బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ ముగ్గురు స్పిన్నర్లతో ఆడుతోందని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. ఇంగ్లండ్‌తో మూడో టీ20లో ఆడని రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీలు జట్టులోకి వచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీలో శుభారంభం కోసం భారత్ చూస్తోంది. బలాబలాలు, గత రికార్డుల ప్రకారం చూస్తే ఈ మ్యాచ్‌లో భారత…
IND vs BAN: ఛాంపియన్స్ ట్రోఫీలో తమ మొదటి మ్యాచ్ ను బంగ్లాదేశ్ తో భారత్ దుబాయ్ వేదికగా తలపడబోతుంది. ఇక, తమ తొలి మ్యాచ్‌లో ఈ రోజు (ఫిబ్రవరి 20) బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడుతుంది.
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీకి తెరలేచింది. నేడు ఫిబ్రవరి 19న పాకిస్తాన్, న్యూజీలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. కరాచీలోని నేషనల్ స్టేడియం వేదికగా ఇరు జట్లు గెలుపు కోసం పోటీపడ్డాయి. తొలి మ్యాచ్ లో న్యూజీలాండ్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించిన న్యూజీలాండ్ ఛాంపియన్ ట్రోఫీలో ఖాతా తెరిచింది. 60 పరుగుల తేడాతో పాక్ పై కివీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో భాగంగా ముందుగా టాస్…
కరాచీ స్టేడియంలో చోటు చేసుకున్న ఓ ఘటన వివాదానికి దారి తీసింది. దీంతో భారత జాతీయ జెండాను ఆ స్టేడియంలో ప్రదర్శించకపోవడంతో పాక్ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దెబ్బకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు దిగొచ్చింది. ఇక, దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఆ స్టేడియంలో ఇండియన్ ఫ్లాగ్ ను ప్రదర్శించింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట దర్శనమిస్తున్నాయి.
Champions Trophy 2025: ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఈరోజు (ఫిబ్రవరి 19) నుంచి ప్రారంభం కానుంది. కరాచీ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ పాకిస్తాన్- న్యూజిలాండ్‌తో తలపడటంతో టోర్నమెంట్ ప్రారంభమవుతుంది.
BCCI: ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఘోర ఓటమి తర్వాత ప్లేయర్స్, స్టాఫ్‌కు సంబంధించి బీసీసీఐ కఠిన నిబంధనలు విధించింది. ఇకపై క్రికెటర్లు తమ భాగస్వాములు, ఫ్యామిలిని వెంట తీసుకెళ్లడం సహా పలు సౌకర్యాల విషయంలో ఆంక్షలు పెట్టింది.