ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమిండియా శనివారం సాయంత్రం దుబాయ్ చేరుకుంది. ఆదివారం భారత జట్టు ప్రాక్టీస్ సెషన్ ప్రారంభించి.. ఐసీసీ అకాడమీలో తమ శిక్షణను కొనసాగించింది. అయితే ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడ్డాడు. ఆదివారం ఐసీసీ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు రిషబ్ పంత్ ఎడమ మోకాలికి గాయమైంది. బౌలర్ వేసిన స్లాష్ పంత్ ఎడమ మోకాలికి తగిలింది. దీంతో వెంటనే నేలపై పడిపోయాడు. ఈ క్రమంలో వైద్య బృందం రంగంలోకి దిగి అతనికి ఐస్ ప్యాక్ వేశారు. అయినప్పటికీ పంత్ నొప్పితో బాధపడుతున్నట్లు కనిపించాడు. ఐసింగ్ తర్వాత పంత్ కుంటుతూ కనిపించాడు.
2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 20న భారత్, బంగ్లాదేశ్‌తో తమ మొదటి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత.. భారత జట్టు 23న పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం రెండు దేశాల క్రికట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారత జట్టు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తమ సన్నాహాలు చేస్తూ.. అద్భుతమైన రికార్డును కొనసాగించాలనే లక్ష్యంతో ఈ టోర్నీకి సిద్ధమవుతోంది.
Read Also: Hollywood: ప్రముఖ హాలీవుడ్ నటి కన్నుమూత..
2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్)
శుభ్‌మన్ గిల్ (వైస్-కెప్టెన్)
విరాట్ కోహ్లీ
శ్రేయాస్ అయ్యర్
కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్)
రిషబ్ పంత్ (వికెట్ కీపర్)
హార్దిక్ పాండ్యా
అక్షర్ పటేల్
వాషింగ్టన్ సుందర్
కుల్దీప్ యాదవ్
హర్షిత్ రాణా
మహమ్మద్ షమీ
అర్ష్‌దీప్ సింగ్
రవీంద్ర జడేజా
వరుణ్ చక్రవర్తి
2025 ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్‌లు:
గ్రూప్ ఎ: పాకిస్తాన్, ఇండియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్
గ్రూప్ బి: దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్
భారత జట్టు షెడ్యూల్:
ఫిబ్రవరి 20: భారత జట్టు vs బంగ్లాదేశ్
ఫిబ్రవరి 23: భారత జట్టు vs పాకిస్తాన్
మార్చి 2: భారత జట్టు vs న్యూజిలాండ్