ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ జట్టుతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బరిలో దిగుతాడా? లేదా? అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. మెగా టోర్నీలో బుమ్రా ఆడడంపై బీసీసీఐ మంగళవారం తుది నిర్ణయం తీసుకోనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో మార్పులు చేర్పులకు నేటితో గడువు ముగుస్తుండంతో.. బుమ్రాపై ఏదో ఒక నిర్ణయం…
Harbhajan-Akhtar: భారత్ – పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే క్రీడాభిమానులకు పండగే. అయితే ఈ రెండు జట్లు కలిస్తే మాటల తూటాలు, భావోద్వేగాలు, అప్పుడప్పుడు చిన్నపాటి గొడవలు కూడా మామూలే. కిరణ్ మోరే – జావేద్ మియాందాద్, అమీర్ సొహైల్ – వెంకటేశ్ ప్రసాద్ మధ్య జరిగిన ఘర్షణలు ఇప్పటికీ క్రికెట్ అభిమానుల మదిలో నేటి కూడా సజీవంగా ఉన్నాయి. అయితే హర్భజన్ సింగ్, షోయబ్ అక్తర్ మధ్య జరిగిన ఆసక్తికర సంఘటన మాత్రం కొంచెం విచిత్రం.…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో వన్డేలో విజయం సాధించి.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. కాగా.. ఈనెల 12న మూడో వన్డే మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి టీం ఇండియా ప్లేయింగ్-11పై ఉండనుంది. ఇప్పటికే సిరీస్ గెలిచిన భారత జట్టు ఈ మ్యాచ్‌లో మార్పులు చేసే అవకాశం ఉంది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు టీమిండియాకు శుభవార్త. కొంత కాలంగా పరుగులు చేయడంలో ఇబ్బందిపడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లోకి వచ్చాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ సెంచరీ (119; 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) బాదాడు. 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ, 76 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకుని మునుపటి రోహిత్‌ను తలపించాడు. చాలా నెలల తర్వాత హిట్‌మ్యాన్ సెంచరీ బాదడంతో ఫాన్స్…
టీ20ల్లో అదరగొడుతున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి.. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో అరంగేట్రం చేశాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో వరుణ్‌కు అవకాశం దక్కింది. తన 10 ఓవర్ల స్పెల్‌లో 54 పరుగులు ఇచ్చి.. ఓ వికెట్ తీశాడు. టాప్ బ్యాటర్లను సైతం ఇబ్బందిపెడుతున్న వరుణ్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లోనూ అవకాశం దక్కనుందని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా స్పందించాడు. ఎంతో అనుభవం కలిగిన…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ ట్రోఫీ కోసం ఇప్పటికే అన్ని టీమ్స్ తమ స్క్వాడ్‌లను ప్రకటించాయి. స్క్వాడ్‌లో మార్పులు చేసుకొనేందుకు అధికారికంగా ఇంకా మూడు రోజుల గడువు ఉంది. అయితే ఈ ఐసీసీ ట్రోఫీలో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడతాడా? లేదా? అనేది ఇంకా తెలియరావడం లేదు. స్క్వాడ్‌లో మార్పులు చేసుకొనేందుకు గడువు ముగుస్తున్నా.. బుమ్రా ఫిట్‌నెస్ విషయంలో బీసీసీఐ ఓ అంచనాకు రాలేకపోయింది. పేస్…
ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. అయితే 23న భారత్-పాకిస్తాన్ మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. కాగా.. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఆన్‌లైన్‌లో విడుదల చేయగానే నిమిషాల్లోనే టికెట్లు ఖతమయ్యాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ మ్యాచ్ గరిష్ట టికెట్ ధర రూ. 1.20 లక్షలు. ఈ టికెట్లు కూడా పూర్తిగా అమ్ముడయ్యాయి.
రికీ పాంటింగ్ ఐసీసీ రివ్యూ ఎపిసోడ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనలిస్టులు ఎవరనే దానిపై విశ్లేషణ చేశాడు. ఈ సందర్భంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లోకి భారత్, ఆస్ట్రేలియా అడుగు పెడతాయని చెప్పుకొచ్చాడు. ఈ రెండు టీమ్స్ ఇప్పటికే చెరో రెండు సార్లు ఈ ట్రోఫీని దక్కించుకున్నాయని రిక్కీ పాటింగ్ అన్నారు.
ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆరంభం కానుంది. ఈ టోర్నీ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సర్వం సిద్ధం చేస్తోంది. ట్రోఫీ ఏర్పాట్లలో బిజీగా ఉన్న పీసీబీకి మరో తలనొప్పి వచ్చింది. పాకిస్థాన్‌కు వన్డే ప్రపంచకప్ అందించిన మాజీ కెప్టెన్, మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ పేరును గడాఫీ స్టేడియం నుంచి తొలగిస్తారనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. ఈ వార్తలపై పీసీబీ వర్గాలు స్పందించాయి. ఎవరి పేర్లను తొలగించడం గాని, మార్చడం…