Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలాయి. 19 ఫిబ్రవరి నుంచి ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈ సమయంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) టోర్నీకి సంబంధించిన ప్రైజ్ మనీని ప్రకటించింది. ఈసారి 8 జట్ల మధ్య జరుగనున్న ఈ టోర్నమెంట్ కోసం ఐసీసీ భారీ ప్రైజ్ మనీని ప్రకటించింది. విశేషం ఏమిటంటే, గత చాంపియన్స్ ట్రోఫీతో పోలిస్తే ఈసారి ప్రైజ్ మనీ 53% పెరిగింది. 8 సంవత్సరాల తరువాత చాంపియన్స్ ట్రోఫీ తిరిగి జరుగుతుంది. 2017లో చివరిసారి ఈ టోర్నమెంట్ జరిగింది. ఈసారి చాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ఐసీసీ మొత్తం 6.9 మిలియన్ యూఎస్ డాలర్లు ప్రైజ్ మనీగా నిర్ణయించింది. చాంపియన్ జట్టుకు 2.24 మిలియన్ డాలర్లు (సుమారు 20 కోట్లు) అందజేయబడతాయి. అలాగే రన్నరప్ జట్టుకు 1.12 మిలియన్ డాలర్లు (సుమారు 10 కోట్లు) ఇవ్వనున్నారు. సెమీఫైనల్‌లో ఓడిన జట్లకు కూడా చెరో 5 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీగా అందించబడతాయి.
Also Read: Pawan Kalyan: ఎమ్మెల్సీ ఎన్నికలపై పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం.. కో-ఆర్డినేటర్ల నియామకం..
అంతే కాదండోయ్.. ఈసారి, గ్రూప్ స్టేజ్‌లో విజయం సాధించే జట్లు కూడా ప్రైజ్ మనీ పొందనున్నాయి. 5వ, 6వ స్థానంలో ఉండే జట్లు సుమారు 3 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ పొందుతాయి. 7వ, 8వ స్థానంలో ఉన్న జట్లు కూడా 1.2 కోట్లు ప్రైజ్ మనీగా పొందనున్నాయి. అంతేకాకుండా ప్రతి గ్రూప్ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్లకు 34,000 డాలర్లు (సుమారు 30 లక్షలు) కూడా ఇవ్వబడతాయి. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే అన్ని 8 జట్లకు 1.25 లక్షల డాలర్లు (సుమారు 1 కోటి రూపాయలు) ప్రత్యేకంగా అందజేయబడతాయి.
Also Read: Teacher: “నా గర్ల్‌ఫ్రెండ్‌గా ఉండు”.. ఏకలవ్యుడిని ఉదహరిస్తూ, విద్యార్థినికి టీచర్ వేధింపులు..
ఐసీసీ అధ్యక్షుడు జయ్ షా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2025 చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్‌కు ఒక మైలురాయి. ఇది ఒక ముఖ్యమైన టోర్నమెంట్‌ను తిరిగి జీవితం లోకి తీసుకొస్తున్నాము. ఇది వన్డే ఫార్మాట్‌లో అత్యున్నతమైన పోటీ. ప్రతి మ్యాచ్ కీలకమైనది. ఈ ప్రైజ్ మనీని ప్రకటించడం ద్వారా ఐసీసీ క్రికెట్‌లో పెట్టుబడులు పెట్టడంపై, అలాగే ప్రపంచవ్యాప్తంగా మా కార్యాచరణల గ్లోబల్ ప్రతిష్టను నిలబెట్టడంపై తన నిబద్ధతను ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఈ ప్రైజ్ మనీతో 2025 చాంపియన్స్ ట్రోఫీకి క్రికెట్ ప్రపంచం చాలా అంచనాలు పెట్టుకుంటుంది.