ప్రేమికుల రోజున ప్రజలు ఆవును కౌగిలించుకోవాలన్న ప్రభుత్వ సంస్థ విజ్ఞప్తిని సోషల్ మీడియాలో మీమ్స్ పోటెత్తడంతో భారత జంతు సంరక్షణ బోర్డు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.
కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్షాల కంటే ముందే కేంద్రం చర్చకు రావాలని బీఆర్‌ఎస్ ఎంపీలు వ్యాఖ్యానించారు. సభ నుంచి పారిపోయే ప్రయత్నం చేయవద్దని తెలంగాణ లోక్‌సభాపక్ష నేత, బీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.
చైనా, థాయ్‌లాండ్‌తో సహా ఆరు దేశాల ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ టెస్ట్ రిపోర్ట్ తప్పనిసరి చేయడానికి ముందు, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇవాళ అంతర్జాతీయ విమానాలలో వచ్చే ప్రయాణీకుల కోసం సవరించిన కోవిడ్ మార్గదర్శకాలను జారీ చేసింది.
2021లో దేశంలో ప్రతిరోజూ 115 మంది రోజువారీ వేతన జీవులు, 63 మంది గృహిణులు తమ జీవితాలను ముగించుకున్నారని.. దేశంలో మొత్తం 1,64,033 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని మంగళవారం లోక్‌సభలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ తెలియజేశారు.
ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు సహా 14 రాష్ట్రాల్లోని 50 పట్టణాల్లో 5జీ సేవలు ప్రారంభమయ్యాయని టెలికమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి దేవుసింగ్ చౌహాన్ బుధవారం పార్లమెంట్‌కు తెలిపారు.