దేశంలో “ఒమిక్రాన్”!వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాసారు. “కొవిడ్” నిబంధనలపై నిర్లక్ష్యంగా ఉండొద్దని, వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలపై మరింత దృష్టిపెట్టాలని సూచించారు. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 27 జిల్లాల్లో గత రెండు వారాలుగా పాజిటివిటీ రేటు పెరుగుతోందని, వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్న కేంద్రం… కేరళ,…
బంగాళాఖాతంలో ఏర్పడిన జవాద్ తుపానును ఎదుర్కొనేందుకు కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. తాజా పరిస్థితులను కేంద్రం సమీక్షించింది. ప్రాణ నష్టానికి అవకాశం లేకుండా.. ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలకు ఆదేశించింది. తుఫాను శనివారం ఉదయం నాటికి ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా ఏపీ, ఒడిశా రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.సముద్రంలో…
ఏపీ ప్రజల పాలిట వరప్రదాయిని పోలవరం ప్రాజెక్ట్. రాజ్యసభలో డ్యాం సేఫ్టీ బిల్లు పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాలను వెంటనే ఆమోదించాలని కేంద్రాన్ని కోరారు. సవరించిన అంచనాలను ఆమోదించేందుకు తీవ్ర కాలయాపన జరుగుతోందన్నారు. దీనివల్ల రైతులకు నష్టం జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని 31 డ్యాంల పునరావాసం కోసం ఖర్చయ్యే 776 కోట్ల రూపాయలు…
తెలంగాణలో ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్ల పైనే చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయం పై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ధాన్యం సేకరణలో కేంద్రం వైఖరి రైతాంగాన్ని ఇబ్బంది పెరుగుతుంది అని అన్నారు. ఇప్పటికైనా కేంద్రం సమగ్ర విధానం ప్రకటించాలి అని చెప్పిన సీఎం కేసీఆర్ రైతుల ప్రయోజనాల కోసం పోరాడేందుకు సిద్ధం అని ప్రకటించారు. ఈ విషయంపై కేంద్రాన్ని పార్లమెంటు వేదికగా నిలదీస్తాం అని చెప్పారు. ఉభయసభల్లోనూ మా ఎంపీలు గళమెత్తారు అని అన్న…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఆర్థికంగా కుదురుకునేందుకు కేంద్రం మరో అవకాశం కల్పించింది. అప్పులపై ఆధారపడుతూ అమలు అవుతున్న సంక్షేమ పథకాలకు.. మరో ఉతం అందింది. వచ్చింది చిన్నదైనా.. కనీసం నెలో.. రెండు నెలలో మెయింటైన్ చేయగలిగేలా.. ఆర్థిక వనరులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమకూర్చుకుంటోంది. ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంకు నుంచి 2 వేల కోట్ల రూపాయలను అప్పు రూపంలో జగన్ ప్రభుత్వం అందిపుచ్చుకుంది. తాజాగా.. కేంద్రం ఏపీకి 1438 కోట్ల రూపాయలను అందించింది. రెవెన్యూ లోటును భర్తీ చేసే…
ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరింత ఊరట కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని వర్గాలకు పూర్తిగా ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించింది. గర్భిణీ మహిళలు, వికలాంగ ఉద్యోగులకు పూర్తిగా ఇంటి నుంచే పని చేసే అవకాశం ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ-డీఓపిటి ఉత్తర్వులు రిలీజ్ చేసింది. కంటైన్‌మెంట్ జోన్ లో నివసించే ఉద్యోగులు, అధికారులు కూడా ఇంటి నుంచే పని చేసేందుకు…