రాజ్యసభలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు విజయసాయి రెడ్డి. ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న విజయసాయి రెడ్డి కేంద్రం తీరుపై తీవ్రంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఎనిమిదేళ్ళు కావస్తున్నా రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న ఆస్తుల పంపకాల గురించి ఆయన ప్రస్తావించారు. ఆస్తుల పంపకాల సమస్యను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని వైఎస్సార్సీపీ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి విమర్శించారు.
విభజన చట్టం ప్రకారం న్యాయసమ్మతంగా, ధర్మబద్దంగా, త్వరితగతిన ఆస్తుల పంపిణీ సమస్యను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేసింది.పరిష్కారంపట్ల కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం చొరవ చూపకుండా ఏళ్ళతరబడి సాచివేత ధోరణి అనుసరిస్తూ వస్తోంది. దీంతో విసిగిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభజన చట్టం ప్రకారం ఆస్తుల పంపిణీ జరపాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించాల్సిన దుస్థితి వచ్చింది. ఈ పరిస్థితికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే కారణం. అడ్డగోలుగా, అప్రజాస్వామిక పద్ధతిలో యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించి ఏపీకి అన్యాయం చేస్తే, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం విభజన సమస్యల పరిష్కారం విషయంలో ఉదాశీనంగా వ్యవహరిస్తోందని ఆయన విరుచుకు పడ్డారు.
CM Jagan: నాటా తెలుగు సభలకు సీఎం జగన్‌కు ఆహ్వానం
ఒకవైపు రాష్ట్రాలకు చెల్లించే జీఎస్టీ పరిహారాన్ని నిలిపివేస్తోంది. మరోవైపు ఆంధ్రా, తెలంగాణ మధ్య ఆస్తులు, ఆర్థిక వనరుల పంపిణీ సమస్యలను పరిష్కారానికి కృషి చేయకుండా కేంద్రం వ్యవహరిస్తున్నందు వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సమస్యలతో సతమమతం అవుతోందని అన్నారు.
Read Also: Congress Seniors Strategy.. Off The Record: కాంగ్రెస్ సీనియర్ వ్యూహం అదేనా?