Cow Hug Day: ప్రేమికుల రోజున ప్రజలు ఆవును కౌగిలించుకోవాలన్న ప్రభుత్వ సంస్థ విజ్ఞప్తిని సోషల్ మీడియాలో మీమ్స్ పోటెత్తడంతో భారత జంతు సంరక్షణ బోర్డు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఇటీవల ఇచ్చిన పిలుపును కేంద్ర పశు సంవర్థక శాఖ పరిధిలోని యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఆఫ్ ఇండియా ఉపసంహరించుకుంది. కేంద్ర సర్కారు ఆదేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 14న కౌ హగ్ డేని జరుపుకోవాలని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా జారీ చేసిన విజ్ఞప్తిని ఉపసంహరించుకుంటున్నట్లు బోర్డు కార్యదర్శి ఎస్‌కే దత్తా ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలోని గోవులను ప్రేమించేవారు ఫిబ్రవరి 14న ‘కౌ హగ్ డే’ని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
Atrocious: చిన్నారి పళ్లు విరగొట్టి, నేలకేసి కొట్టి చంపిన తాంత్రికుడు
గోమాత ప్రాధాన్యతను గుర్తించి ఫిబ్రవరి 14న గోవులను ఆలింగనం చేసుకోవాలంటూ భారత జంతు సంరక్షణ బోర్డు తన ఉత్తర్వుల్లో వెల్లడించింది. గోవులను ఆలింగనం చేసుకోవడం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందని… గో ప్రేమికులంతా కౌ హగ్ డేను నిర్వహించుకోవాలని పేర్కొంది. బోర్డు ఇచ్చిన పిలుపుతో ప్రజలు సానుకూలంగా స్పందిస్తే మంచిదేనని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా గురువారం మాట్లాడారు. ఆ పిలుపును తాజాగా ఉపసంహరించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఫిబ్రవరి 14 కౌ హగ్ డే జరుపుకోవాలంటూ బోర్డు ఇచ్చిన పిలుపుపై విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి.