Suicides: 2021లో 1,64,033 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.. పార్లమెంట్‌లో కేంద్రం వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suicides: 2021లో దేశంలో ప్రతిరోజూ 115 మంది రోజువారీ వేతన జీవులు, 63 మంది గృహిణులు తమ జీవితాలను ముగించుకున్నారని.. దేశంలో మొత్తం 1,64,033 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని మంగళవారం లోక్‌సభలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ తెలియజేశారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) నుంచి డేటాను పంచుకుంటూ మంత్రి నిత్యానంద్ రాయ్ మాట్లాడుతూ.. గత ఏడాది మొత్తం 42,004 మంది రోజువారీ వేతన జీవులు, 23,179 మంది గృహిణులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. మొత్తంగా 20,231 మంది స్వయం ఉపాధి పొందేవారు, 15,870 మంది జీతభత్యాలు, 13,714 మంది నిరుద్యోగులు, 13,089 మంది విద్యార్థులు, 12,055 మంది వ్యాపారులు, 11,431 మంది ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేసేవారుఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆయన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
Covid Bells: మళ్లీ దడ పుట్టిస్తున్న కొవిడ్ కేసులు.. భారత్‌కు నాలుగో వేవ్ ముప్పు!
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
10,881 మంది వ్యవసాయ రంగంలో నిమగ్నమై ఉన్న వారు ఆత్మహత్య చేసుకున్నారు. 5,563 మంది వ్యవసాయ కార్మికులు, 5,318 మంది రైతులు లేదా సాగుదారులు, 4,806 మంది వ్యవసాయ కూలీల సహాయంతో లేదా వారి సహాయం లేకుండా సొంత భూమిని సాగుచేసుకున్న వారు, 512 మంది భూమిని కౌలుకు తీసుకుని సాగుచేసే వారు అందులో ఉన్నారు. వ్యవసాయ కూలీల సహాయంతో లేదా లేకుండా కౌలు లేదా ఇతరుల భూమిపై ఆధారపడిన వారు కూడా 2021లో ఆత్మహత్య చేసుకున్నారని కేంద్ర మంత్రి వెల్లడించారు.
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!