దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యం కేంద్ర హైఅలర్ట్ ప్రకటించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కొవిడ్ అలర్ట్ జారీ చేసింది. కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది.
లోక్‌సభ ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని, రాహుల్ కోసం పోరాటం చేస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంపై తీవ్ర దాడిని ప్రారంభించారు. ప్రకటనలపై అధిక వ్యయం కారణంగా ఢిల్లీ బడ్జెట్‌కు అంతకుముందు రోజు కేంద్రం ఆమోదం ఇవ్వలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం బుధవారం బడ్జెట్ సమర్పణకు ఆమోదం తెలపడానికి ముందు ప్రకటనల ఖర్చుపై వివరణ ఇవ్వాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై తమ వైఖరిని స్పష్టం చేయాలని కాంగ్రెస్ శుక్రవారం బీజేపీని కోరింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల రెండో భాగంలో లోక్‌సభలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేసింది.
ప్రతిష్టాత్మకమైన అగ్నిపథ్ పథకానికి అనుగుణంగా సరిహద్దు భద్రతా దళంలో ఖాళీగా ఉన్న మాజీ అగ్నివీరులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపులతో 10 శాతం రిజర్వేషన్లను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఔరంగాబాద్, ఉస్మానాబాద్ నగరాల పేర్లు వరుసగా ఛత్రపతి శంభాజీ నగర్, ధరాశివ్‌గా మార్చబడ్డాయి. శుక్రవారం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనను ఆమోదించింది.
పోలీసు స్టేషన్‌లు, దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను నెల రోజుల్లోగా పాటించాలని సూచించింది.
పాఠశాలల్లో చిన్నారుల అడ్మిషన్లకు సంబంధించి కేంద్రం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఒకటో తరగతిలో చేర్చుకునే చిన్నారులకు కనీసం ఆరేళ్ల వయసు ఉండాలనే నిబంధనను పక్కాగా అమలు చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది.
Wheat Price : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా గోధుమల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితిలో, గోధుమ ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉన్న భారతదేశం వైపు ప్రపంచం దృష్టి పడింది.