జల్ సంచయ్ జన్ భాగీదారీ విభాగంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం టాప్‌లో నిలిచింది. కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన 6వ జాతీయ జల అవార్డులు-2024లో.. తెలంగాణ జాతీయ స్థాయిలో తొలి ర్యాంకును సాధించింది. కేంద్ర ప్రభుత్వం 2024లో ప్రారంభించిన ఈ కార్యక్రమం కింద.. తెలంగాణ మొత్తం 5,20,362 పనులు పూర్తిచేసింది. Also Read: MeeSeva services on WhatsApp: వాట్సాప్ లో “మీ సేవ” సేవలు.. ప్రారంభించిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు.. జల్ సంచయ్…
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్న కారణంగా.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా పారదర్శక విచారణ కోసం సీబీఐకి కేసు అప్పగించామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ కేసును సీబీఐకి అప్పగించే ప్రక్రియ వేగం అందుకొంది. ఆదివారం కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు సీఎం ప్రకటించగా.. సభ ఆమోదించింది.…
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తన అధికారిక ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టులో.. విశాఖ స్టీల్ పై కేంద్రానిది ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్.. ఆదుకోవడం పచ్చి అబద్ధం.. ఉద్ధరించడం అంతా బూటకం.. ప్రైవేటీకరణ లేదంటూనే ప్లాంట్ లో 44 EOI లకు ప్రైవేట్ కాంట్రాక్టర్లను పిలవడం దారుణం.. ఇది ప్లాంట్ ను చంపే కుట్రలో భాగమే.. 5 వేల మంది కార్మికులను ఎందుకు తొలగించారు ?.. ఆ పనులను ఎందుకు…
Caste Census Survey: కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు దశల్లో దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి తొలి దశ కుల గణన చేపట్టడానికి ప్లాన్ చేస్తుండగా.. 2027 మార్చి 1వ తేదీ నుంచి రెండో దశ కుల గణన చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
Polavaram-Banakacherla Project: పోలవరం- బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ఆర్థికశాఖ అధికారుల సమావేశం అయ్యారు. పోలవరం- బనకచర్ల ప్రాజెక్టు లక్ష్యాలు, కలిగే ప్రయోజనాలపై కేంద్ర ఆర్థిక శాఖ అధికారులకు సవివరంగా వెల్లడించారు.
జ్యోతి మల్హోత్రాపై దేశద్రోహం ఆరోపణలతో విచారణను భారత ఇంటెలిజెన్స్ ముమ్మరం చేసింది. ఈ కేసులో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్, ఢిల్లీలోని పాక్ హైకమిషన్ అధికారుల పాత్రను లోతుగా పరిశీలిస్తుంది. ఈ కేసును ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించాలని ఆలోచనలో కేంద్ర హోం శాఖ ఉంది.
Waqf Amendment Act: వక్ఫ్ సవరణ చట్టం 2025 రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఈరోజు (మంగళవారం) విచారించనుంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.
Jagga Reddy: ప్రస్తుతం భారత్- పాకిస్తాన్ యుద్ధంపై చర్చ కంటే ఎక్కువ ఇందిరా గాంధీ ఉన్నప్పుడు జరిగిన యుద్ధం గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక సూత్రధారి అయినటు వంటి మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకి కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
Bird Flu Virus: బర్డ్ ఫ్లూతో పల్నాడు జిల్లా నర్సరావుపేటకు చెందిన రెండేళ్ల చిన్నారి మృతి రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ రకాల వైరస్ లను నిర్ధారించేందుకు గుంటూరు మెడికల్ కాలేజీలో బర్డ్ ఫ్లూ రీజనల్ సర్వేలెన్స్ సెంటర్ ను ఏర్పాటు చేసింది.