Bharat Series Registrations: భారత్ సిరీస్ నెంబర్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం వాహనాల రిజిస్ట్రేషన్ కి సంబంధించి పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రాల వారీగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రస్తుత వాహనాలు సైతం భారత్ (బీహెచ్) సిరీస్ నంబర్లను పొందవచ్చని కేంద్రం పేర్కొంది. ఈమేరకు కేంద్రం అనుమతి ఇచ్చింది. బీహెచ్ సిరీస్ (BH Series) నిబంధనలను మార్చినట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ తెలిపింది. బీహెచ్ సిరీస్ వ్యవస్థను బలోపేతం చేసేందుకే తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు కొత్త వాహనాలు మాత్రమే బీహెచ్ సిరీస్ తీసుకోడానికి వీలుండేది. ‘అవసరమైన పన్ను చెల్లింపులు చేసి సాధారణ రిజిస్ట్రేషన్ మార్కు ఉన్న వాహనాలు సైతం బీహెచ్ సిరీస్‌కు మారొచ్చ’ని కేంద్రం పేర్కొంది.
Read Also: Astrology: డిసెంబర్ 17, శనివారం దినఫలాలు
Also Read
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
నివాసం ఉంటున్న లేదా పనిచేస్తున్న ప్రాంతంలో, తమ వాహనం కోసం బీహెచ్ సిరీస్ దరఖాస్తు సమర్పించేందుకు వీలుగా ‘రూల్ 48’ను సైతం సవరించాలని మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఈ వెసులుబాటును దుర్వినియోగం చేయకుండా ‘వర్కింగ్ సర్టిఫికెట్’ను ప్రైవేటు రంగ ఉద్యోగులు సమర్పించాల్సి ఉంటుంది. రవాణా శాఖ వాటిని పరిశీలించి బీహెచ్ సిరీస్ అందచేస్తుంది. ఒక రాష్ట్రానికి చెందిన వ్యక్తి నుంచి మరొక రాష్ట్రానికి చెందిన వ్యక్తికి వ్యక్తిగత వాహనాల బదిలీ సులువుగా ఉండేందుకు, గతేడాది సెప్టెంబరులో సరికొత్త రిజిస్ట్రేషన్ ‘భారత్ సిరీస్ (బీహెచ్ సిరీస్)’ను కేంద్రం అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే.

బీహెచ్ సిరీస్ ని ఇలా అర్థం చేసుకోండి
‘నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో కార్యాలయాలు ఉన్న రక్షణ రంగ సిబ్బంది, కేంద్ర ప్రభుత్వ/రాష్ట్ర ప్రభుత్వ/రాష్ట్ర ప్రభుత్వ రంగ/ప్రైవేటు రంగ సంస్థలకు బీహెచ్ సిరీస్‌ను అందుబాటులోకి తెచ్చిన’ట్లు ఒక ప్రకటనలో మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మారినప్పుడు, మళ్లీ వాహన రిజిస్ట్రేషన్ చేయించే శ్రమ తప్పుతుంది. దీనివల్ల డబ్బుకూడా ఆదా అవుతుంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ఇప్పటిదాకా 49,600 వాహనాలు భారత్ సిరీస్ కింద రిజిస్టర్ అయ్యాయి. కేంద్రం వెసులుబాటు ఇవ్వడంతో రాబోయే కాలంలో వీటి రిజిస్ట్రేషన్లు పెరుగుతాయని భావిస్తున్నారు.
Read Also: Fire Accident: మంచిర్యాలలో ఘోర అగ్నిప్రమాదం.. 6మంది సజీవదహనం
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..