ముస్లిం యువతుల వివాహానికి కనీస వయస్సును ఇతర మతాలకు చెందిన వారితో సమానంగా చేయాలని జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్ల్యూ) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం నాలుగు వారాల్లోగా కేంద్రం స్పందించాలని కోరింది.
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో వివిధ విభాగాలకు సంబంధించి 9,79,327 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో వెల్లడించారు. రైల్వే మంత్రిత్వ శాఖలో 2,93,943, రక్షణ శాఖలో 2,64,704 మంది, హోం వ్యవహారాల్లో 1,43,536 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.
ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకంపై కేంద్రం జాప్యం చేస్తుండడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. జడ్జీల నియామకం కోసం కొలీజియం చేసిన సిఫార్సులపై కేంద్ర ప్రభుత్వం తీరు విసుగు తెప్పించేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
అరుణ్ గోయల్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియామకం ఎందుకంత వేగంగా చేపట్టాల్సి వచ్చిందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. గోయల్ నియామకానికి సంబంధించిన దస్త్రాలను వేగంగా ఆమోదించడంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి మరోసారి మద్దతుగా నిలిచారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై మండిపడ్డారు. కుట్రపూరిత రాజకీయాలతోనే సౌరభ్ గంగూలీని ఐసీసీ ఛైర్మన్ పదవికి నామినేట్ చేయలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ విధాన నిర్ణయాలపై న్యాయసమీక్ష పరిమితులకు సంబంధించిన లక్ష్మణరేఖ ఎక్కడుందో తమకు తెలుసని.. అయినా 2016లో ప్రధాని మోదీ సర్కారు ప్రకటించిన నోట్ల రద్దు అంశాన్ని పరిశీలించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మిషన్ భగీరథకు జాతీయ అవార్డుపై కేంద్ర జల శక్తి శాఖ స్పందించింది. మిషన్ భగీరథకు జాతీయ అవార్డు ఇచ్చారనడం అబద్దమని కేంద్రం వెల్లడించింది. ఆ పథకాన్ని కేంద్రం అసలు అంచనా వేయనేలేదని జలశక్తి శాఖ వెల్లడించింది.
ఐదేళ్లపాటు కేంద్రం నిషేధించిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) సమాజంలో హింసకు బీజం వేస్తోందనడానికి తగిన ఆధారాలు ఉన్నాయని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బుధవారం అన్నారు. సైలెంట్ కిల్లర్‌లా పుకార్లు వ్యాప్తి చేస్తూ హింసను ప్రేరేపించడమే పీఎఫ్‌ఐ లక్ష్యమని ఆయన వెల్లడించారు.