ఢిల్లీ కొత్త ప్రధాన కార్యదర్శిగా 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి పీకే గుప్తాను నియమించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం కేంద్రం ఆమోదం కోరినట్లు అధికారులు గురువారం తెలిపారు.
ఎరువుల ధరలను పెంచకూడదని కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయించింది. జూన్-సెప్టెంబర్ ఖరీఫ్ లేదా వేసవి సీజన్ కోసం రూ.1.08 లక్షల కోట్ల పంట-పోషక సబ్సిడీని ఆమోదించిందని కేంద్ర ఆరోగ్య, ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మీడియా సమావేశంలో తెలిపారు. దేశంలో యూరియాతో సహా అన్ని కీలక ఎరువుల కోసం తగినంత నిల్వలు, ఏర్పాట్లు ఉన్నాయని మంత్రి తెలిపారు.
వైసీపీ ప్రభుత్వంపై ఏపీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చే పథకాలను తమ సొంత పథకాలుగా వైసీపీ ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటు అంటూ ఆయన మండిపడ్డారు.
దేశంలో కొవిడ్ పరిస్థితులపై రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. కొవిడ్-19 నిర్వహణ, ప్రజారోగ్య సంసిద్ధతపై రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ మేరకు సూచనలు చేశారు.
2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్‌లో అల్లర్లు జరిగినప్పుడు తనపై అత్యాచారానికి పాల్పడ్డ దోషులను ముందస్తుగా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ బాధితురాలు బిల్కిస్ బానో వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది.