5G Services: ఢిల్లీ, ముంబై సహా 50 పట్టణాల్లో 5జీ సేవలు.. పార్లమెంట్‌లో కేంద్రం వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
5G Services: ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు సహా 14 రాష్ట్రాల్లోని 50 పట్టణాల్లో 5జీ సేవలు ప్రారంభమయ్యాయని టెలికమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి దేవుసింగ్ చౌహాన్ బుధవారం పార్లమెంట్‌కు తెలిపారు. లోక్‌సభలో చౌహాన్ పంచుకున్న సమాచారం ప్రకారం, గుజరాత్‌లో అన్ని జిల్లాల్లో 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. “టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు అక్టోబర్ 1, 2022 నుంచి దేశంలో 5జీ సేవలను అందించడం ప్రారంభించారు. నవంబర్ 26, 2022 నాటికి, 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 50 పట్టణాలలో 5జీ సేవలు ప్రారంభించబడ్డాయి” అని చౌహాన్ చెప్పారు.
టెలికాం ఆపరేటర్లు అందించిన సమాచారం ప్రకారం.. మార్చి 2022 నాటికి దేశంలోని 6,44,131 గ్రామాల్లో 6,05,230 గ్రామాలు మొబైల్ ఇంటర్నెట్ కనెక్టివిటీని కలిగి ఉన్నాయని, 38,901 గ్రామాలకు మాత్రమే కనెక్టివిటీ లేదని ఆయన వెల్లడించారు. గ్రామాలలో ఇంటర్నెట్ కనెక్టివిటీపై లోక్‌సభలో అడిగిన ప్రత్యేక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.
Also Read
- Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
- Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
- Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
Paytm LPG Offers: శుభవార్త.. ఇలా చేస్తే గ్యాస్ బుకింగ్‌పై రూ.1000 క్యాష్ బ్యాక్
గిరిజన ప్రాంతంలో మొబైల్ కవరేజీపై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, ఆయా జిల్లాల్లో 25 శాతానికి పైగా గిరిజన జనాభా ఉన్న 1,20,613 గ్రామాలలో 1,00,030 లేదా 83 శాతం గ్రామాలు మొబైల్ నెట్‌వర్క్ కవరేజీని కలిగి ఉన్నాయని, 20,583 గ్రామాలు ఎటువంటి మొబైల్ కవరేజీని కలిగి లేవన్నారు. దేశంలో సుమారు 2.6 లక్షల గ్రామ పంచాయతీలు (జీపీలు) ఉన్నాయని, వాటిలో 1,84,399 గ్రామపంచాయతీలు సర్వీస్‌కు సిద్ధంగా ఉన్నాయని భారత్‌నెట్ ప్రాజెక్టుపై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.
తాజావార్తలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
-
Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
-
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!