సంచలనం సృష్టిస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. ఈకేసులో ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసిన వ్యాపారవేత్త, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సన్నిహితుడైన దినేష్ అరోరా అప్రూవర్‌గా మారిపోయాడు.. దీంతో, మనీష్ సిసోడియా చిక్కుల్లో పడినట్టు అయ్యింది.. దినేష్ అరోరా బ్యాంకు ఖాతాకు విజయ్ నాయర్ డబ్బులు పంపినట్టుగా అభియోగాలున్నాయి.. దీంతో దినేష్ అరోరాను సాక్షిగా పరిగణించాలని కోరుతూ సీబీఐ అధికారులు కోర్టులో పిటీషన్ వేశారు.. దినేష్ అప్రూవర్‌గా మారారని..…
Ayyanna Patrudu Arrest: మాజీ మంత్రి, టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై ఇంటి గోడ కూల్చివేత అంశంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారన్నది అభియోగం.
10 States withdraws general consent to CBI, including telangana: తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు తలెత్తాయి. ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరస్థితి ఏర్పడింది. అయితే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ పాత్ర లేదని.. ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీనే కావాలని కట్టుకథలను అల్లుతుందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరపాలని కోర్టులో పిటిషన్…
Manish Sisodia summoned by CBI in Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిలీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) నోటీసుల జారీ చేసింది. సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ, ఈడీలు అనుమానితుల ఇళ్లపై పలు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించాయి. ఇప్పటికే కొంతమందిని విచారిస్తున్నాయి. సోమవారం ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
Abhishek Rao's custody extended in Delhi liquor scam: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్(సీబీఐ), ఈడీలు విచారణ కొనసాగిస్తున్నాయి. ఈ లిక్కర్ స్కామ్ లో హైదరాబాద్ కు చెందిన పలువురు ఉన్నట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఇప్పటికే అభిషేక్ రావును లిక్కర్ స్కామ్ లో సీబీఐ ఈ నెల 9న అరెస్ట్ చేసింది. మరుసటి రోజునే కోర్టు ముందు హాజరుపరిచారు. నేటితో అభిషేక్ రావు కస్టడీ ముగిసింది.