ఢిల్లీ లిక్కర్ కేసు మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో నిందితుడు, వ్యాపార వేత్త దినేష్ అరోరా (Dinesh Arora) అప్రూవర్ గా మారాడు. ఈ కేసులో దినేష్ అరోరా స్టేట్మెంట్ రికార్డ్ చేసింది ధర్మాసనం… ఎవరైనా బెదిరించారా,ఏమైనా ఇబ్బందులకు గురి చేశారా అని దినేష్ అరోరాను అడిగారు సీబీఐ కోర్టు న్యాయమూర్తి.. ఈ నెల 14కు కేసు వాయిదా వేసింది. ఈ కేసుపై విచారణ జరిగింది. ఈ అంశం చాలా సున్నితమైనదని, మీడియాను కోర్టు లోకి అనుమతించవద్దంటూ జస్టిస్ దృష్టికి తీసుకెళ్లారు దినేష్ అరోరా తరపు న్యాయవాది.
అప్రూవర్ గా మారిన నిందితుడు వ్యాపారవేత్త దినేష్ అరోరా కీలక వ్యాఖ్యలు చేశారు. దినేష్ అరోరాను సాక్షిగా పరిగణించాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సిబీఐ. సిబిఐ పిటిషన్ పై వాదనలు కొనసాగాయి. లిక్కర్ స్కాం నిందితుడు దినేష్ ఆరోరాను సీబీఐ కోర్టుకు తీసుకువచ్చిన సీబీఐ. లిక్కర్ స్కాం లో వ్యాపార వేత్త దినేష్ అరోరా అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే. తనపై ఎవరి వత్తిడి లేదు, అప్రూవర్ గా మారాను అని సీబీఐ కోర్టుకు తెలిపాడు లిక్కర్ కేసు నిందితుడు దినేష్ అరోరా. సీబీఐ న్యాయమూర్తి ఎం కె నాగ్ పాల్ ముందు ఒప్పుకున్నాడు దినేష్ అరోరా..విచారణకు పూర్తిగా సహకరిస్తానన్నాడు. సీబీఐ జడ్జి ముందు దినేష్ అరోరా వాంగ్మూలం ముగిసింది. ఇందులో కీలకాంశాలు వున్నట్టు తెలుస్తోంది.
Read Also: JC Prabhakar Reddy: రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్‌రెడ్డి.. మహిళా కలెక్టర్‌కు వార్నింగ్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో లింక్‌లను బయటపెట్టింది.. దానిని లింకులు తెలంగాణలోనూ తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి.. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ, ఈడీ అధికారులు పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు.. పలువురు ప్రముఖులను సైతం అరెస్ట్ చేశారు.. సీబీఐ అరెస్ట్‌చేసిన వారిలో వ్యాపారవేత్త దినేష్ అరోరా ఒకరు కాగా.. ఇప్పుడు ఆయన అఫ్రూవర్‌గా మారడం ఆసక్తికరంగా మారింది.. మరోవైపు, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో హైదరాబాద్‌కు చెందిన.. అభిషేక్ రావు, అరుణ్ రామచంద్రన్ పిళ్లైలు కూడా ఉన్నారు. దినేష్ అరోరా వాంగ్మూలం అనంతరం ఈ కేసులో కీలక పరిణామాలు ఉంటాయని భావిస్తున్నారు.
Read Also: Samantha: మయోసైటిస్ వ్యాధితో సమంత ఎలా అయిపోయిందో చూడండి