ఇప్పటికే మద్యం విధానంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ సర్కారుకు లోఫ్లోర్ బస్సుల వ్యవహారం రూపంలో మరో చిక్కు వచ్చి పడింది. ఢిల్లీలో 1,000 లో–ఫ్లోర్ బస్సుల కొనుగోలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తుకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశించారు.
తనను తప్పుడు ఎక్సైజ్ కేసులో ఇరికించాలని ఒత్తిడి తెచ్చినందుకే సీబీఐ అధికారి ఆత్మహత్య చేసుకున్నారని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సోమవారం పేర్కొన్నారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి బీజేపీయేతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను అస్థిరపరచాలని ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నారని ఆయన ఆరోపించారు.
CBI searched Delhi Deputy CM's bank lockers: ఢిల్లీ మద్యం స్కామ్ లో సీబీఐ దూకుడు పెంచింది. ఏ1 నిందితుడిగా ఉన్న ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సంబంధించిన లాకర్లను మంగళవారం పరిశీలించారు సీబీఐ అధికారులు. దేశ రాజధాని ఢిల్లీ శివారుల్లోని ఘజియాబాద్ సెక్టార్ 4లో ఉన్న పీఎన్బీ బ్యాంచ్ లో ఐదుగురు సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే ఈ సోదాలపై మనీష్ సిసోడియా స్పందించారు. సీబీఐ అధికారుల దాడుల్లో ఏమీ దొరకలేదని ఆయన…
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బ్యాంక్ లాకర్‌ను సీబీఐ అధికారులు ఇవాళ ఓపెన్ చేశారు. ఘజియాబాద్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో సిసోడియాకు లాకర్ ఉండగా.. దర్యాప్తుకు సంబంధించి ఆ లాకర్‌ను సీబీఐ సోదా చేసింది.
రాష్ట్రంలో పథకం ప్రకారం కుట్ర చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. కర్నాటకలో ఈడీ, సీబీఐ దాడులు ఎందుకు జరగవు?. సీబీఐ నోటీసులు ఇస్తుందని బీజేపీ ఎంపీలకు ఎలా తెలుసు? అని మంత్రి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పరిపాలన వదిలి ప్రతిపక్షాలను వేధిస్తోందని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. 8 రాష్టాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వలను పడగొట్టి దొడ్డిదారిన ప్రభుత్వం ఏర్పాటు చేశారని మండిపడ్డారు. కేంద్రం పరిపాలన మర్చిపోయిందని అన్నారు. సీబీఐ నోటీసులు ఇస్తుంది అని బీజేపీ ఎంపీ…
Delhi deputy CM Manish Sisodia made sensational comments against BJP: ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో ఈ లిక్కర్ స్కామ్ అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ స్కామ్ లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఏ1 నిందితుడి.. సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ వ్యవహారం బీజేపీ, ఆప్ పార్టీల మధ్య తీవ్ర దుమారాన్ని రేపుతోంది.
సీబీఐ దాడుల విషయాన్ని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ధ్రువీకరించారు. తన నివాసంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు. ఈ విషయంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు. ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచ్‌లోని ఖజానాలో రూ.11 కోట్ల విలువైన నాణేలు మాయమైన కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది.. గురువారం రోజు 25 చోట్ల సోదాలు నిర్వహించినట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు..