Rotomac Pen : ప్రముఖ పెన్నుల తయారీ సంస్థ రోటోమాక్ చిక్కుల్లో పడింది. ఆ సంస్థపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకును రూ. 750 కోట్ల మేర ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకును మోసం చేసిందని రొటోమాక్ పై అభియోగాలను నమోదు చేసింది. కంపెనీ డైరెక్టర్లు సాధన కొఠారి, రాహుల్ కొఠారిలై సెక్షన్ 120 బీ, సెక్షన్ 420కింద అభియోగాలు మోపింది.
Read Also: Minister Harish Rao: రాష్ట్రంలో పదివేలకు చేరువలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పడకలు
బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని ఏడు బ్యాంకుల కన్సార్టియం నుంచి ఈ కంపెనీ మొత్తం రూ. 2,919 కోట్ల అప్పు తీసుకుంది. ఇందులో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వాటా 23 శాతం. 2012 జూన్ 28 న రోటోమాక్ కంపెనీకి రూ. 500 కోట్ల నాన్-ఫండ్ ఆధారిత పరిమితిని మంజూరు చేసినట్లు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించింది. 2016 జూన్ 30న పేమెంట్లలో ఈ కంపెనీ డిఫాల్ట్ అయింది. ఆ తర్వాత రూ.750.54 కోట్ల బకాయితో నిరర్థక ఆస్తిగా ప్రకటించబడింది. కన్సార్టియం సభ్యుల నుంచి వచ్చిన ఫిర్యాదుతో ఇప్పటికే ఈ కంపెనీపై సీబీఐ, ఈడీలు విచారణ జరిపాయి. తాజాగా సీబీఐ కేసు నమోదు చేసింది.
Read Also: Teacher MLC Voter List : టీచర్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు మరో అవకాశం.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..