Delhi Liquor Scam: మనీష్ సిసోడియాకు సీబీఐ నోటీసులు.. “సత్యమేవ జయతే” అంటూ సిసోడియా ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manish Sisodia summoned by CBI in Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) నోటీసుల జారీ చేసింది. సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ, ఈడీలు అనుమానితుల ఇళ్లపై పలు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించాయి. కొంతమందిని విచారిస్తున్నాయి. సోమవారం ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
సీబీఐ సమన్లపై మనీష్ సిసోడియా స్పందించారు. నా ఇంట్లో సీబీఐ 14 గంటలు దాడులు నిర్వహించింది. ఏం దొరకలేదు. నా బ్యాంకు లాకర్లలో సోదాలు చేశారు అప్పుడు కూడా ఏం దొరకలేదని.. హిందీలో మనీష్ సిసోడియా ట్వీట్ చేశారు. రేపు నన్ను ఉదయం 11గంటలకు సీబీఐ ప్రధాన కార్యాలయానికి పిలిచారు. నేను వెళ్లి నా పూర్తి సహకారం అందిస్తా అని.. సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
मेरे घर पर 14 घंटे CBI रेड कराई, कुछ नहीं निकला. मेरा बैंक लॉकर तलाशा, उसमें कुछ नहीं निकला. मेरे गाँव में इन्हें कुछ नहीं मिला.
अब इन्होंने कल 11 बजे मुझे CBI मुख्यालय बुलाया है. मैं जाऊँगा और पूरा सहयोग करूँगा.
सत्यमेव जयते.
— Manish Sisodia (@msisodia) October 16, 2022
Read Also: T20 World Cup : తొలిపోరులోనే శ్రీలంకపై నమీబియా ఘన విజయం
2021-22 ఢిల్లీ మద్యం వివాదంలో భారీగా అవినీతి జరిగిందని సీబీఐ, ఈడీలు ఆరోపిస్తున్నాయి. దీనికి సంబంధించిన పలు ఆధారాలను సేకరించాయి. ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఏ1గా ఉన్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐల ద్వారా దాడులు చేస్తోందని ఆప్ నేతలు విమర్శిస్తున్నారు. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తుండటంతోనే తమను టార్గెట్ చేస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు.
ఈ కేసులో సీబీఐ గతంలో ఢిల్లీ, పంజాబ్, హైదరాబాద్ లోని 35 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఇదిలా ఉంటే మనీష్ సిసోడియాకు సీబీఐ నోటీసులు జారీ చేయడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. జైలు ఊచలు భగత్ సింగ్ ను అడ్డుకోలేదని.. మనీష్, సత్యేంద్ర జైన్ లు నేటి భగత్ సింగ్ లు అని.. స్వాతంత్య్రం కోసం ఇది రెండో పోరాటం అని..75 ఏళ్ల తరువాత పేదలకు మంచి విద్యను అందించి వారి భవిష్యత్తుపై ఆశలు కల్పించిన విద్యాశాఖ మంత్రి దేశానికి లభించారని.. కోట్లాది మంది పేదల ప్రార్థనలు మీ వెంట ఉన్నాయంటూ ట్వీట్ చేశారు.
जेल की सलाख़ें और फाँसी का फंदा भगत सिंह के बुलंद इरादों को डिगा नहीं पाये
ये आज़ादी की दूसरी लड़ाई है।मनीष और सत्येंद्र आज के भगत सिंह है
75 साल बाद देश को एक शिक्षा मंत्री मिला जिसने ग़रीबों को अच्छी शिक्षा देकर सुनहरे भविष्य की उम्मीद दी
करोड़ों ग़रीबों की दुआएँ आपके साथ है https://t.co/slc3lb1Mqp
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 16, 2022
తాజావార్తలు
-
TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
-
Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్‌తో కొత్త గేమింగ్ ఫోన్!
-
IND vs WI 2nd T20: నేడు భారత్, వెస్టిండీస్ రెండో టీ20.. పిచ్ రిపోర్ట్, వాతావరణం, ప్లేయింగ్ 11 ఇదే!
-
Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
-
NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!