Mallu Bhatti Vikramarka: రాహుల్ గాంధీని ఇల్లు ఖాలీ చేయమనడం బీజేపీ కక్ష్య సాదింపే అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. దేశం కోసం స్వతంత్రం కోసం పోరాటం చేసిన కుటుంబాల పట్ల బీజేపీకి గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని ఇల్లు ఖాలీ చేయమనడం బీజేపీ కక్ష్య సాధింపే అని నిప్పులు చెరిగారు. కోట్లాది మంది రాహుల్ గాంధీ వెంట ఉన్నారని భట్టి అన్నారు. ఇక పేపర్ లీక్ ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని భట్టి ఆరోపించారు. అందుకే ప్రశ్నించిన వారిని సిట్ కార్యాలయానికి పిలిపిస్తున్నారని అన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే వాళ్ల బండారం బట్టబయలు కానుందని, అందుకే సిట్టింగ్ జడ్జితో విచారణ వేయడం లేదని ఆరోపణలు గుప్పించారు. పేపర్ లీక్ ద్రోహం ప్రభుత్వం దే అన్నారు.
Read also: School Shooting: స్కూల్లో ఆకస్మికంగా కాల్పులు.. విద్యార్థులు సహా ఆరుగురు మృతి
ఎంపీగా తనకు కేటాయించిన తుగ్లక్ లేన్ బంగ్లాను ఖాళీ చేయాలని కాంగ్రెస్‌కు చెందిన రాహుల్ గాంధీని లోక్‌సభ హౌసింగ్ ప్యానెల్ కోరింది. పరువు నష్టం కేసులో గుజరాత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో పార్లమెంటుకు అనర్హత వేటు వేసిన రెండు రోజుల తర్వాత లోక్‌సభ హౌసింగ్ ప్యానెల్ నుంచి తొలగింపు నోటీసు వచ్చింది. తమకు నోటీసు అందలేదని రాహుల్ గాంధీ బృందం తెలిపింది. ఎంపీగా అనర్హత వేటు పడిన నేపథ్యంలో.. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని లుటియన్స్‌లోని తన అధికారిక బంగ్లాను ఏప్రిల్ 22లోగా ఖాళీ చేయాలని కోరినట్లు సమాచారం. ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయాలని లోక్‌సభ హౌసింగ్ కమిటీ సోమవారం రాహుల్ గాంధీకి నోటీసు జారీ చేసినట్లు సమాచారం.
Rain Alert: తెలంగాణలో ఉరుములు మెరుపులతో వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్