దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు సిద్ధమవుతున్నారు. హిందువులందరూ కలిసికట్టుగా ఎంతో అంగరంగ వైభవం గా జరుపుకునే పండుగల్లో శ్రీరామ నవమి. ఎక్కడ చూసిన శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. అయితే, శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా కొందరు బీజేపీ నేతలు అతి చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తునున్నాయి. తాజాగా ఢిల్లీలో ఓ బీజేపీ నేత మాంసం దూణాకాల వద్ద హల్ చల్ చేశాడు. నవరాత్రుల సందర్భంగా గోసంరక్షకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు అనేక ప్రాంతాలలో మాంసం దుకాణాలను బలవంతంగా మూసివేశారు. పశ్చిమ ఢిల్లీలోని వినోద్ నగర్‌లోని ముస్లిం ప్రాంతం మండవాలి ఫజల్‌పూర్‌లో బిజెపి నాయకుడు రవీంద్ర సింగ్ హల్ చల్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read:Healthy summer foods: వేసవిలో తినాల్సి కూరగాయాలు ఇవే
మార్చి 22న ప్రారంభమై మార్చి 30న (నవమి తిథి) ముగిసే నవరాత్రుల తొమ్మిది రోజులూ స్థానిక మాంసం వ్యాపారులు దుకాణాలను మూసి ఉంచాలని రవీంద్ర సింగ్ కోరారు. మాంసం దుకాణాలను తనిఖీ చేస్తున్న పోలీసు సిబ్బందితో కలిసి నడుస్తూ కనిపించాడు. నవరాత్రి సమయంలో మాంసం దుకాణాలు మూసివేయడంపై ఎటువంటి అధికార ఉత్తర్వులు లేవు. అయితే, రవీంద్ర సింగ్ స్వయంగా మాంసం దుకాణాలను మూసివేయాలని డిమాండ్ చేస్తూ వాటిని సందర్శించాడు. గోసంరక్షకులు ప్రతి మాంసం దుకాణంపై దాడి చేయడం, షట్టర్‌లను లాగడం చేశారు. నవరాత్రుల కోసం మూసి ఉంచాలని పేర్కొంటూ ముస్లిం మాంసం దుకాణాల యజమానులను బెదిరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
Chicken shops in the Muslim locality of Mandawali Fazalpur in Vinod Nagar West, Delhi, have been shut down by BJP leader Ravindra Singh in honour of Navratri. pic.twitter.com/OZcIj5cfRj
— Meer Faisal (@meerfaisal01) March 28, 2023
అయితే, దీనిపై పోలీసులు స్పందించారు. మాంసం దుకాణాల మూసివేతకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీసులు చెప్పారు. దుకాణదారులపై ఎటువంటి బలవంతం కనిపించడం లేదని, వారు బిజెపి నాయకుడి ఆదేశాన్ని మౌనంగా పాటిస్తున్నారని చెప్పారు. ఇదే విధమైన మరొక సంఘటనలో బిజెపి కౌన్సిలర్ అశోక్ ఛబ్రాతో కలిసి గోరక్షకులు (ఆవు సంరక్షకులు) ముస్లిం మాంసం దుకాణాలపై దాడి చేశారు. నవరాత్రి దృష్ట్యా దుకాణాలను మూసివేయమని బలవంతం చేశారు.
Also Read: MS Dhoni: చెపాక్ స్టేడియంలో ధోనీ.. బ్యాటింగ్ ప్రాక్టీస్ తో బిజీ
గౌరక్షా దళ్ క్రిషన్‌పురా కూడా నవరాత్రుల సమయంలో మాంసం దుకాణాలు తెరిచి ఉంచడం మరియు హిందువుల మనోభావాలను దెబ్బతీయడంపై ఫిర్యాదు చేసింది. గోరక్షా దళ్ క్రిషన్‌పురా కూడా నవరాత్రుల సమయంలో మాంసం దుకాణాలు తెరిచి ఉంచడం, హిందువుల మనోభావాలను దెబ్బతీయడం ఆగ్రహం వ్యక్తం చేసింది.
Members of a cow vigilante group and BJP councilor Ashok Chhabra forced meat shops to close for Navratri in Krishnapura, Panipat, Haryana.
pic.twitter.com/4fKc2jyTQB— Ahmed Khabeer احمد خبیر (@AhmedKhabeer_) March 27, 2023