Harish Rao: KCR అంటే సిద్దిపేట.. సిద్దిపేట అంటే KCR మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూర్ నల్ల పోచమ్మ ఆలయంలో మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం BRS పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు, జెడ్పీ చైర్మన్ రోజా హాజరయ్యారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. KCR గులాబీ జెండా ఎత్తింది నంగునూరులోనే అన్నారు. ఇక్కడి నుంచే KCR ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చారన్నారు. KCR అంటే సిద్దిపేట..సిద్దిపేట అంటే KCR అన్నారు. సిద్దిపేట పేరును ఆకాశం అంతా ఎత్తుకు తీసుకెళ్లారని హరీష్ రావు అన్నారు. తెలంగాణ రాక ముందు.. వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉందో మీకే తెలుసు అని తెలిపారు. నాడు కరెంట్ ఉంటే వార్త.. నేడు కరెంట్ పోతే వార్త అంటూ హాస్యాస్పదం చేశారు. ఆనాడు కాంగ్రెస్, TDP ప్రభుత్వంలో ట్రాన్స్ ఫార్మర్లు కావాలంటే లంచాలు అని ఆరోపించారు. BJP వాళ్ళు బాయి, బోరు కాడా మీటర్ పెడితే 30 వేల కోట్లు ఇస్తా అన్నారు. KCR మాత్రం నా గొంతులో ప్రాణం ఉండగా మీటర్లు పెట్టను అన్నాడన్నారు. ఆనాడు నీళ్ల కోసం బిందెలు కొట్లాడేవి అని, మిషన్ భగిరథతో ఇంటింటికి నీళ్లు ఇచ్చిన్నామన్నారు.
Read also: Sri Rama Navami : శ్రీరామ నవమి రోజు చేయవలసిన, చేయకూడని పనులు
గతంలో తెలంగాణలో వలసలు ఉండేవి కానీ.. నేడు ఇక్కడ పనులు చేయడానికి ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ కూలీలకు వస్తున్నారు అన్నారు. KCR చేతిలో అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా ఇంత అభివృద్ధి చేయడానికి అనుకోవచ్చు. కానీ KCR అనే దీపంతో తెలంగాణలో రైతులు చల్లగా బతుకుతున్నారని వ్యాఖ్యానించారు. BJP వాళ్ళు ఆధాని, అంబానీ ఆస్తులు పెంచుతున్నారని మండిపడ్డారు. BRS ఏమో అన్నదాతల ఆమ్దాని పెంచుతుందని మంత్రి తెలిపారు. BRS అంటే B అంటే బీదల పార్టీ, R అంటే రైతుల పార్టీ అని, S అంటే సామాన్య మధ్య తరగతి పార్టీ అన్నారు. ఆనాడు ఆకలి చావులు.. అంబలి కేంద్రాలు అని, తెలంగాణ రైతులు దేశానికి అన్నం పెడుతున్నారని మంత్రి అన్నారు. బీజేపొడు, కాంగ్రెసోడు గ్రామాల్లోకి వస్తడు.. ఓట్లు అయిపోగానే మాయం ఆయితరు అంటూ ఎద్దేవ చేశారు. అన్ని BRS పార్టీ వాళ్ళకే ఇస్తున్నారని ఎవడో అంటున్నాడు.. ఉన్నదే BRS పార్టీ ఈడ.. మా పార్టీలో గరోబొల్లు లేరా? గరిబోళ్ళు అయితే కచ్చితంగా సహాయం చేస్తాం మని మంత్రి హరీష్ రావు అన్నారు.
Rock salt: రాతి ఉప్పును వాడకపోతే మీకే నష్టం