BJP: ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన పార్టీ, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించారు భారతీయ జనతా పార్టీ నేతలు.. బీజేపీ నేత మాధవ్ ఆ వ్యాఖ్యలకు ఆజ్యం పోశారు.. పొత్తు ఉన్నా లేనట్టే అంటూనే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన సహకరించలేదని కుండ బద్దలు కొట్టారు.. పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లినా.. ఆయన మద్దతు ఇవ్వలేదని పేర్కొన్నారు.. ఇక, ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా అదే తరహాలో కామెంట్లు చేశారు.. అయితే, జనసేన సహకారం అంతంత మాత్రమేనంటూ బీజేపీ నేతలు కామెంట్లు చేసిన కొన్ని రోజులకే ఏపీ బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. అన్ని రకాల పరిస్థితులను ఫేస్ చేసేందుకు బీజేపీ సిద్ధం అవుతోంది..
Read Also: CM YS Jagan Delhi Tour: మరోసారి ఢిల్లీకి ఏపీ సీఎం..
రాష్ట్రంలోని యుద్ద ప్రాతిపదికన అసెంబ్లీ కన్వీనర్లు.. కో-కన్వీనర్లను నియమించింది బీజేపీ.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 163 మందిని వివిధ నియోజకవర్గాల్లో కన్వీనర్లు, కో-కన్వీనర్లుగా నియమించారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సోము వీర్రాజు.. ఆయా నియోజకవర్గాలు, కన్వీనర్లు, కో-కన్వీనర్ల జాబితాను విడుదల చేశారు.. పొత్తుల్లేకున్నా.. మేం ఒంటరి పోరుకు సిద్దమనే సంకేతాలు ఇచ్చేందుకు బీజేపీ ఇలా వ్యూహంతో ముందుకు వెళ్తుందా? అనే చర్చ సాగుతోంది.. అయితే, పొత్తులకూ.. ఈ నియామకాలకు సంబంధం లేదంటున్నారు ఏపీ బీజేపీ నేతలు.. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం జరిపిన నియామకాలు మాత్రమే అంటున్నారు బీజేపీ రాష్ట్ర నేతలు.. అన్ని పార్టీలు ఏ విధంగా ఇంఛార్జిలను నియమిస్తున్నాయో.. మేం అదే తరహాలో కన్వీనర్లను నియమిస్తున్నామని చెబుతున్నారు కమలనాథులు.. పార్టీ పటిష్టం చేయడంపైనే మా దృష్టి.. పొత్తుల అంశం మాత్రం హైకమాండ్ చూసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.. ఏపీ బీజేపీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నట్టు స్పష్టం అవుతోంది.. రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు కన్వీనర్లను ప్రకటించారు ఏపీ బీజేపీ.. కన్వీనర్‌తో పాటు కో-కన్వీనర్లనూ నియమించారు.. వచ్చే ఎన్నికల్లో వీళ్లనే అభ్యర్థులుగా బరిలోకి దించే ఛాన్స్ ఉందంటున్నారు..