మహారాష్ట్ర నుంచి పలువురు చేరికల సందర్భంగా సీఎం కేసిఆర్ మాట్లాడుతూ.. నా 50 ఏళ్ల రాజకీయ జీవితంలో రైతుల గురించి ఏ నాయకుడు మాట్లాడలేదన్నారు. మన దగ్గర సత్తా ఉంటే అసంభవం అంటే ఏమి ఉండదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం సందర్శించాలని మిమ్ములను కోరుతున్నానని, ఢిల్లీ లో రైతులు నెలల తరబడి ధర్నాలు నిరసనలు చేశారన్నారు. రైతుల పోరాటం న్యాయమైందని, ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తే ఖలిస్తాన్ ఉగ్రవాదులు, తీవ్రవాదులు అని ముద్ర వేశారని ఆయన మండిపడ్డారు. చలిలో నిద్రాహారాలు మాని నిరసన, ఉద్యమాలు చేశారని, 700 మంది రైతులు చనిపోయిన తర్వాత కూడా వారి కుటుంబాలకు మోడీ చేసిందేమీ లేదన్నారు.
Also Read : KKR vs PBKS : బాదుడే.. 10 ఓవర్లు పంజాబ్ స్కోరు ఎంతంటే..?
తెలంగాణ వచ్చాక అన్ని సమస్యలు పరిష్కరించుకున్నామని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో రైతు అత్మహత్యలు లేవని, దేశంలో అన్ని ఉన్నాయని, కానీ సింగపూర్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన దేశం పరిస్థితులు ఎలా ఉన్నాయో గమనించాలన్నారు. మన దేశ పరిస్థితి చూసి సిగ్గుతో తల దించుకోవాలని, నా రాజకీయ జీవితంలో ఎన్నో ఆటు పొట్లు ఎదుర్కొన్నానని ఆయన వెల్లడించారు. ప్రధాని మంత్రి మన దేశానికి 14 వ ప్రధాని అని, ఆయనకు ఆలోచన శక్తి లేదని సీఎం కేసీఆర్ విమర్శించారు.
Also Read : Praveen Prakash: పామర్రులో జెడ్పీ స్కూల్ ఆకస్మిక తనిఖీ