Dr K.Laxman: భద్రాచలం వెళ్తే సీఎం పదవి పోతుందని కేసీఆర్ వెళ్లడం లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ మూఢ విశ్వాసాలు ఈసారి ఎన్నికలు గట్టెక్కించలేవని తెలిపారు. భద్రాద్రి రాముడిని కూడా సీఎం కేసీఆర్ అవమానిస్తున్నారని అన్నారు. కేంద్రం రైతులకు సహాయం చేయడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. SDRF కింద తెలంగాణకు కేంద్రం 3,250 కోట్ల రూపాయలు కేటాయించిందని అన్నారు. ఎన్నికలు వస్తే తప్ప బీఆర్ఎస్ నేతలకు ప్రజలు గుర్తుకురారని తెలిపారు.
Read also: Harirama Jogaiah: ఇలా చేస్తే ఐదేళ్లు పవన్ కల్యాణే సీఎంగా ఉంటారు..!
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాల్లో 70 శాతం సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వెల్ లకే కేటాయించారని అన్నారు. కేంద్రం నిధులు దారి మల్లుతున్నాయ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో 20 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఏప్రిల్ 8న మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని అన్నారు. పెట్రోల్, డీజిల్ పై చర్చకు రావాలని సవాల్ చేస్తున్నానని తెలిపారు. పెట్రోల్, డీజిల్ ని GST పరిధిలోకి రాకుండా సమావేశాల్లో మంత్రి హరీష్ రావు అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. TSPSC పై విద్యాశాఖ మంత్రి మాట్లాడరు, సిట్ దర్యాప్తు పై హోం మంత్రి స్పందించరని, గుమ్మడి కాయ దొంగమాదిరిగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారని లక్ష్మణ్ ఎద్దేవ చేశారు.
IPL2023 : మేం సరికొత్త టీమ్ తో వస్తున్నాం.. భువనేశ్వర్