Off The Record: ఒంటరిపోరే శరణ్యమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో తమ పరిస్థితి ఏంటో.. వచ్చే ఎన్నికలకు ఏ విధంగా బరిలో దిగాలో బీజేపీకి క్లారిటీ వచ్చినట్టు ఉంది. తాజాగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కొత్త వారికి బాధ్యతలు అప్పగించింది. ఏదో డిసైడయ్యే కమలనాథులు అడుగులు వేస్తున్నారా? ఒంటరి పోరుకు మానసికంగా సిద్ధం అవుతున్నారా?
Also Read
అసెంబ్లీ కన్వీనర్లను నియమించిన బీజేపీ
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉంటే.. 147 చోట్ల అసెంబ్లీ కన్వీనర్లను.. కో కన్వీనర్లను నియమించింది బీజేపీ. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమన్న సంకేతాలు ఇచ్చింది. అయితే కన్వీనర్ల నియామకమే కొత్త చర్చకు ఆస్కారం ఇస్తోంది. ఇటీవల జనసేనతో పొత్తు.. ఆ పార్టీ సహకారంపై బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో చర్చించారు. జనసేన తమకు ఎంత మాత్రం సహకరించడం లేదని మెజారిటీ నేతలు తమ అభిప్రాయంగా చెప్పారని టాక్. ఆ తర్వాత అసెంబ్లీ కన్వీనర్ల నియామకం బయటకు రావడంతో బీజేపీ ఓ నిర్ణయానికి వచ్చే ఈ ప్రకటన చేసిందని సమాచారం.
ఒంటరి పోరుకు సిద్ధమని బీజేపీ సంకేతాలు
జనసేన తమతో కలిసి రాదనే అభిప్రాయాన్ని బయటకు చెప్పకపోయినా.. ఆ విషయంలో ఒక స్పష్టతకు వచ్చిన ఏపీ బీజేపీ నేతలు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. చివరి వరకు వేచి చూసేకంటే.. ముందుగానే అసెంబ్లీ సెగ్మెంట్లకు కన్వీనర్లను ప్రకటించి పార్టీ పని మొదలుపెట్టి.. అభ్యర్థులను ఎంపిక చేసి ఫీల్డ్‌లోకి దిగొచ్చనే ఆలోచనలో కమలనాథులు ఉన్నట్టు ఆ పార్టీ వర్గాల వాదన. జనసేన కలిసి వచ్చినా రాకున్నా.. బీజేపీ బలోపేతం కావాలి కదా అని పదాధికారుల సమావేశంలో పార్టీ అగ్రనేత శివప్రకాష్ ప్రశ్నించారని.. క్షేత్రస్థాయిలో పార్టీ ప్రతినిధులు లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుందని ఏపీ నేతలను ఆయన హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం 147 నియోజకవర్గాలకు సారథులను ఖరారు చేశారు.
అసెంబ్లీ కన్వీనర్లే బీజేపీ అభ్యర్థులా?
ప్రస్తుతం అసెంబ్లీ కన్వీనర్లుగా ఉన్నవారే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారనే వాదన బీజేపీలో ఉంది. అదే జనసేనతో పొత్తుపై ఆశలు సజీవంగా ఉండి ఉంటే 147 నియోజకవర్గాలకు ఈ విధంగా కన్వీనర్లను.. కో కన్వీనర్లను ప్రకటించరు కదా అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండటంతో.. ఈలోగా వారి పనితీరును ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుని అభ్యర్థులుగా ఖరారు చేయొచ్చనే అభిప్రాయంలో కూడా బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీని విమర్శించే ప్రతి ఒక్కరూ అసలు 175 నియోజకవర్గాల్లో పార్టీకి అభ్యర్థులు ఉన్నారా అని ప్రశ్నిస్తుంటారు. ఆ విమర్శలకు కన్వీనర్ల నియామకంతో చెక్ పెట్టినట్టుగా కొందరి వాదన. మొత్తానికి నియోజకవర్గాల్లో బీజేపీ నాయకత్వాన్ని సిద్ధం చేయడం.. కన్వీనర్ల పేరుతో కార్యక్రమాల స్పీడ్ పెంచడం.. ఒంటరి పోరుకు కూడా సిద్ధమనే సంకేతాలు ఇవ్వడానికి ఏపీ లీడర్స్ క్రమంగా అడుగులు వేస్తున్నట్టు అర్థం అవుతోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ఒంటరి పోరే..!
గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఏపీలో బీజేపీ సింగిల్‌గానే పోటీ చేసింది. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయనే విమర్శలు మూటగట్టుకుంది. 2019 ఎన్నికల తర్వాత పార్టీ రాష్ట్రంలో బలపడిందా అంటే.. పెదవి విరిచే పరిస్థితి. ఈ మూడేళ్లలో జరిగిన తిరుపతి లోక్‌సభ, బద్వేలు, ఆత్మకూరు ఉపఎన్నికలు, స్థానిక సంస్థలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లలో బీజేపీకి వచ్చిన ఓట్లు ఆ పార్టీ బలాన్ని తెలియజేస్తున్నాయి. పొరుగునే ఉన్న తెలంగాణలోనూ ఏపీలోని బీజేపీ పరిస్థితికి అస్సలు పొంతన లేదు. తెలంగాణ మాదిరి పురోగతి ఉంటే ఈపాటికే బీజేపీ అగ్రనేతల ఫోకస్ పెరిగేది. అసలు ఢిల్లీ పెద్దలు ఏపీ బీజేపీ శాఖను పట్టించుకుంటున్నారో లేదో అన్న సందేహాలు పార్టీ శ్రేణుల్లోనూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఒంటరిపోరు అంటే బీజేపీ ఏ పొజిషన్‌లో ఉంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!