Congress: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై పలు విదేశాలు స్పందిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, జర్మనీలు పరిస్థితిని గమనిస్తున్నామంటూ వ్యాఖ్యలు చేశాయి. అయితే నిన్న జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖ రాహుల్ గాంధీ అనర్హతపై స్పందించింది. ‘‘ భారత్ లో రాహుల్ గాంధీకి జైలు శిక్ష, లోక్ సభ సభ్యత్వం కోల్పోవడం వంటి అంశాలను మేం గమనిస్తున్నాం, ఈ కేసులో ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు వర్తిస్తాయి. రాహుల్ గాంధీ పైకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు.’’ అని…
బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు దొంగలే అని ఎం.ఎల్.సి. జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీతో రైతులకు, కూలీలకు రక్షణ కల్పిస్తే.. మోడీ ప్రభుత్వం ఆదానీ, అంబానీలకు 12ల క్షల కోట్లు మాఫీ చేసిందని మండిపడ్డారు.
నల్లగొండ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. దేశ వ్యాప్తంగా రాములోరి కళ్యాణం, ఊరేగింపు అంగరంగ వైభవంగా జరుగుతుంటే.. తిరుమలగిరిలో మాత్రం శ్రీరామ నవమి సందర్భంగా రికార్డింగ్ డాన్సులతో మారుమోగింది.
Howrah Ram Navami clashes: అనుకన్నట్లుగానే దేశంలోని పలు ప్రాంతాల్లో రామనవమి ఊరేగింపు సమయంలో అల్లర్లు జరిగాయి. గుజరాత్ వడోదరా, మహరాష్ట్ర ఔరంగాబాద్, బెంగాల్ హౌరాల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. ముఖ్యంగా హౌరాలో ఈ అల్లర్లు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు పలు వాహానాలకు నిప్పుపెట్టారు. ఇదిలా ఉంటే ఈ అల్లర్లు అధికార త్రుణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), బీజేపీల మధ్య తీవ్ర రాజకీయ వివాదంగా మారింది.
Aam Aadmi Party: ప్రధాని నరేంద్రమోదీని టార్గెట్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) విమర్శలు గుప్పిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో ఆప్ వర్సెస్ బీజేపీగా రాజకీయ పోరాటం కొనసాగుతోంది. ద్వేషాన్ని ఆపడానికి, విధానాలు రూపొందించడానికి, ఈ దేశ వ్యవస్థాపకుల కలలను సాకారం చేయడానికి భారతదేశానికి విద్యావంతులైన ప్రధాని అవసరమని ఆప్ ఈ రోజు శ్రీనగర్ లో వ్యాఖ్యానించింది.
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీరామ నవమిని జరుపుకునే భక్తులు దయచేసి ముస్లిం ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు. రామ నవమి ఊరేగింపులను శాంతియుతంగా జరుపుకోవాలని ఆమె అభ్యర్థించారు. రంజాన్ జరుగుతున్నందున ముస్లిం ప్రాంతాలకు దూరంగా ఉండాలని, శాంతియుతంగా పండగ జరుపుకోవాలని, హింసను సృష్టించవద్దని కోరారు. ఊరేగింపుల్లో కత్తుల, చాకులతో వస్తామని కొందరు బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని, అయితే ఇది క్రిమినల్ నేరం అని మర్చిపోవద్దని, కోర్టులు మిమ్మల్ని…
Karnataka Elections: కేంద్ర ఎన్నికల సంఘం కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో రాజకీయ పోరాటం ప్రారంభం అయింది. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్, మరోసారి అధికారం నిలుపుకునేందుకు బీజేపీ, కింగ్ మేకర్ పాత్ర పోషించేందుకు జేడీఎస్ ప్రజలను ఆకట్టుకోవాలని చూస్తున్నాయి. ఇదిలా ఉంటే కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధ రామయ్య తనకు ఇవే చివరి ఎన్నికలంటూ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేశారు.