Petrol Rates: ఇటీవల కాలంలో కేంద్రం పెట్రోల్, డిజిల్ రేట్లను తగ్గిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కీలక వ్యాఖ్యలు చేశారు.
Lord Hanuman: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హనుమంతుడి గురించి చేసిన వ్యాఖ్యలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారాయి. మధ్యప్రదేశ్ మాజీ అటవీ శాఖ మంత్రి, ధార్ జిల్లా గంద్వానీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమర్ సింఘార్.. ‘హనుమంతుడు ఆదివాసీ’ అని అన్నారు. ధార్ జిల్లాలో గిరిజన నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా 123వ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Amit Shah: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. విదేశాలకు వెళ్లి సొంతదేశాలను విమర్శించడం ఏ పార్టీ అధినేతకు కూడా తగదని రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఉద్దేశించి అన్నారు. భారత్‌పై దుష్ప్రచారం చేయడానికే రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లారని ఆరోపించిన అమిత్ షా.. తన పూర్వీకుల నుంచి నేర్చుకోవాలని సూచించారు.
Giriraj Singh: బీజేపీ ఫైర్ బ్రాండ్ గా పేరున్న కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై విరుచుకుపడ్డారు. ఇటీవల మహారాష్ట్ర కొల్హాపూర్ ఘర్షణ నేపథ్యంలో దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ ఓవైసీ విమర్శలు గుప్పించారు.
Harish Rao: పుట్టుక నుండి చావు దాకా ప్రజలకు ఏం కావాలో ఆలోచించింది సీఎం కేసీఆర్ అని ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. KPHB డివిజన్ 5 వ ఫేస్ లోధ టవర్స్ సమీపంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
త్వరలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తుందని బీజేపీ ఓడిపోవడం ఖాయమని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. గడిచిన ఐదేళ్ళలో మా ప్రభుత్వం అనుసరించిన విధానాలు, మేము చేసిన అభివృద్ధిని మాత్రమే ప్రజలు తీసుకుంటారు.
మోడీ తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన దేశాభివృద్ధిని వివరించేందుకు బీజేపీ తలపెట్టిన సభల్లో ఒకటి శనివారం సాయంత్రం శ్రీకాళహస్తిలోని భేరివారి మండపం వద్ద జరగనుంది. ఇవాళ శ్రీకాళహస్తిలో జేపీ నడ్డా అధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమైంది.
Off The Record: తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజుల నుంచి సమాధానం లేని ప్రశ్నగా మిగిలిన అంశం అమిత్ షా-చంద్రబాబు భేటీ. ఇద్దరూ సుమారు 50 నిమిషాల పాటు సమావేశం అయ్యారు. మీటింగ్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా పాల్గొన్నారు. దీంతో ఈ రెండు పార్టీలు తిరిగి పొత్తులు పెట్టుకోబోతున్నాయా..? మళ్లీ 2014 ఎన్నికల సీన్ రిపీట్ అవుతుందా..? అనే చర్చ అప్పటి నుంచి జరుగుతోంది. అదే సమయంలో తెలంగాణలో కొందరు బీజేపీ నేతలు టీడీపీతో…