2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ-శివసేన పొత్తులు అంతా సవ్యంగా సాగడం లేదన్న చర్చ ప్రస్తుతం జోరుగా జరుగుతోంది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే కళ్యాణ్ లోక్‌సభ స్థానంపై థానే బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ కేల్కర్ హాట్ కామెంట్స్ చేశారు. అక్కడ బీజేపీ సహాయం లేకుండా థానే నుంచి ఎవరూ ఎన్నిక కాలేరని ఆయన వ్యాఖ్యనించారు. కళ్యాణ్‌తో పాటు, థానే, పాల్ఘర్ లోక్‌సభ స్థానాల్లో కూడా బీజేపీ అధిష్టానం గురించి కేల్కర్ మాట్లాడారు.
Also Read : Bhopal Fire Accident: భోపాల్‌లోని సాత్పురా భవన్‌లో అగ్ని ప్రమాదం
కళ్యాణ్- థానే ఒకే లోక్‌సభ నియోజకవర్గంగా ఉన్నప్పుడు.. అప్పటి నుంచి బీజేపీ అగ్రనేతలు ఇక్కడ నుంచే ఎన్నికయ్యారని బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ కేల్కర్ అన్నారు. రాంభౌమల్గి, జగన్నాథ్ పాటిల్ అక్కడి నుంచి ఎంపీలుగా పని చేశారు. చింతామన్ వనగా పాల్ఘర్ 9 సార్లు పోటీ చేశారు.. 4 సార్లు ఎన్నికయ్యారు. అక్కడ కాంగ్రెస్, కమ్యూనిస్టులతో బీజేపీ చాలాకాలం పాటు పోరాడింది అని ఆయన అన్నారు. అయితే పొత్తులో భాగంగా ఈ సీట్లు శివసేనకు దక్కాయి.. అయితే, శివసేన గెలుపు కోసం మా కార్యకర్తలు అక్కడ తీవ్రంగా కష్టపడ్డారు అని కేల్కర్ తెలిపారు.
Also Read : Tamannaah Bhatia: అవును, ఆ సంబంధం ఉంది.. రూమర్స్‌పై తమన్నా క్లారిటీ
కళ్యాణ్ లోక్‌సభ నియోజకవర్గంలో ఇటీవల స్థానిక బీజేపీ నేతలు సమావేశం అయ్యారు. ఈ సీటుపై శివసేనకు బీజేపీ మద్దతివ్వబోదని ఇందులో తీర్మానం చేశారు. దీంతో శ్రీకాంత్ షిండే దానిపై స్పందించారు. 2024లో ప్రజలందరూ నరేంద్ర మోడీని మళ్లీ ఈ దేశానికి ప్రధానిగా ఎన్నుకోవాలని కోరుకుంటున్నామని ఆయన అన్నారు. ఇందుకోసం మా వంతు ప్రయత్నం చేస్తామని శ్రీకాంత్ షిండే తెలిపాడు.
Also Read : Health Tips: రోజంతా యాక్టివ్ గా ఉండాలంటే ఉదయం వీటిని తప్పక తీసుకోవాలి..
కానీ డోంబివిలికి చెందిన కొందరు నాయకులు శివసేన-బీజేపీ కూటమిలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. నేను వ్యక్తిగతంగా ఏ పదవికి ఆశపడను అని శ్రీకాంత్ షిండే అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేయాలనేది శివసేన-బీజేపీ కూటమి సీనియర్ నేతలు నిర్ణయించనున్నారు. నేను నామినేషన్ వేయకున్నా.. అభ్యర్థి ఎవరంటే.. ప్రచారం చేసి గెలిపిస్తామని శ్రీకాంత్ షిండే వెల్లడించారు.