మనీలాండరింగ్ ఆరోపణలతో తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అధికారులు అరెస్టు చేయడంపై విపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వ సంస్థలను చేతిలో పెట్టుకుని ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశాయి. అరెస్టు సమయంలో ఛాతి నొప్పితో కుప్పకూలి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి సెంథిల్ బాలాజీని సీఎం స్టాలిన్ పరామర్శించారు. సీఎంతో పాటు డీఎంకే పార్టీ నేతలు మంత్రిని పరామర్శించేందుకు క్యూ కట్టారు.
Also Read : Vikarabad Sireesha Case: అనుమానమే నిజమైంది.. నాలుగు రోజులకు వీడిన శిరీష మిస్టరీ కేసు
కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆరోపించారు. బీజేపీ బెదిరింపులకు భయపడేది లేదని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యనించారు. సిద్ధాంతపరంగా బీజేపీపై పోరాటం చేస్తామన్నారు. సెంథిల్ బాలాజీ అరెస్టుపై న్యాయపోరాటానికి దిగుతామని వెల్లడించారు. మానసికంగా, శారీరకంగా హింసించడంతో బాలాజీకి ఛాతిలో నొప్పి వచ్చింది.. బీజేపీ అణిచివేత వ్యూహాలను గమనిస్తున్నాం.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు అని సీఎం అన్నారు. సెంథిల్ బాలాజీ అరెస్టును కాంగ్రెస్ పార్టీ ఖండించింది. మోడీ సర్కార్ రాజకీయ కక్ష సాధింపులకు దిగుతోందని ఆ పార్టీ నేత మల్లిఖార్జున ఖర్గే అన్నారు. ఇలాంటి చర్యలను విపక్షాలు ఏ మాత్రం ఉపేక్షించవని ఆయన ఫైర్ అయ్యారు.
Till 2 am, they kept pressuring him and then took him to the hospital. Now he's admitted to ICU. Even after he said that he will cooperate in the investigation, why did they torture him? We can clearly see the wrong intentions of those who sent these officials. They acted in an… https://t.co/O5A732wQaL
— ANI (@ANI) June 14, 2023
Also Read : Priyamani Latest Pics: పింక్ డ్రెస్‌లో ప్రియమణి.. టాప్ టూ బాటమ్ అందాల ప్రదర్శన! పిక్స్ వైరల్
ఈడీ దాడులను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమ్‌ఆద్మీ పార్టీ నేతలు అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న సెంథిల్‌ను అరెస్టు చేయడం అమానవీయమని ఘటన అన్నారు. దేశంలో ఎన్నో సమస్యలు ఉంటే వాటన్నింటినీ గాలికొదిలేసి.. ప్రతిపక్ష నేతలపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపట్టడంలోనే కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపిస్తుందని విమర్శించింది. సెంథిల్ బాలాజీ అరెస్టు రాజకీయ కక్ష సాధింపు చర్యేనని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ఆమె విమర్శించారు. ఇలాంటి చర్యలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. మంత్రి సెంథిల్ బాలాజీ హెల్త్ బులిటెన్ ను వైద్యులు విడుదల చేశారు. మంత్రి సెంథిల్ బాలాజీ కరోనరీ యాంజియోగ్రామ్ చేయించుకున్నారు. వీలైనంత త్వరగా బైపాస్ సర్జరీ చేయడం మంచిది అని తమిళనాడు ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు తెలిపారు.
State minister Senthil Balaji underwent Coronary Angiogram today; Bypass surgery is advised at the earliest: Tamil Nadu Government Multi Super Speciality Hospital, Chennai pic.twitter.com/UgGmMz6Wcd
— ANI (@ANI) June 14, 2023